India vs Afghanistan quarterfinal: ఏషియన్ గేమ్స్ 2026 (Asian Games 2026)లో భారత్‌కు సెప్టెంబర్ 28 మరో కీలక రోజు. ఎనిమిదో రోజు ముగిసే సమయానికి భారత ఖాతాలో 37 పతకాలు ఉన్నాయి. తొమ్మిదో రోజు ఈ సంఖ్యను పెంచే అవకాశాలు పలు క్రీడల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు (Team India) పురుషుల విభాగంలో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని జట్టు అఫ్గానిస్థాన్ (Afghanistan)తో క్వార్టర్‌ఫైనల్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు షెడ్యూల్ అయింది. మరోవైపు షూటింగ్‌లో మను భాకర్, ఈషా సింగ్, రాహి సర్నోబత్ పోటీ పడనున్నారు. బాక్సింగ్‌లో ప్రియా, కపిల్ పోఖరియా, లోవ్లినా బోర్గోహైన్ తమ తమ క్వార్టర్‌ఫైనల్ బౌట్లలో బరిలోకి దిగనున్నారు. అథ్లెటిక్స్‌లోనూ పలు మెడల్ ఈవెంట్లు ఉండటంతో భారత్ దృష్టి ఈ క్రీడలపై ఉంది.
క్రికెట్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగే క్వార్టర్‌ఫైనల్ భారత్‌కు రోజులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. క్వార్టర్‌ఫైనల్ విజయం తదుపరి దశకు వెళ్లేందుకు కీలకం కానుంది.
షూటింగ్‌లో ఉదయం 6:10 గంటలకు మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను భాకర్, ఈషా సింగ్, రాహి సర్నోబత్ క్వాలిఫికేషన్ పోటీలో పాల్గొంటారు. అర్హత సాధిస్తే ఉదయం 10:45 గంటలకు వ్యక్తిగత ఫైనల్‌లోనూ పోటీ చేసే అవకాశం ఉంది. ట్రాప్ విభాగాల్లోనూ భారత షూటర్లు బరిలో ఉంటారు.
బాక్సింగ్‌లో మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రియా 60 కేజీల క్వార్టర్‌ఫైనల్‌లో తజికిస్థాన్‌కు చెందిన మిజ్గోనా సమడోవాతో తలపడనుంది. 3:45 గంటలకు కపిల్ పోఖరియా 90 కేజీల విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గిచేతో పోటీ పడతాడు. సాయంత్రం 4 గంటలకు లోవ్లినా బోర్గోహైన్ 75 కేజీల క్వార్టర్‌ఫైనల్‌లో దక్షిణ కొరియా బాక్సర్ సియోంగ్ సుయెయోన్‌ను ఎదుర్కొంటుంది.
అథ్లెటిక్స్‌లో పలు మెడల్ ఈవెంట్లు ఉన్నాయి. అవినాష్ సేబుల్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో పాల్గొంటాడు. శ్రీశంకర్ మురళి లాంగ్ జంప్ ఫైనల్‌లో బరిలోకి దిగనున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ పోటీ పడతారు.
మహిళల 5000 మీటర్ల ఫైనల్‌లో సీమతో పాటు ఇప్పటికే మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కాంస్యం సాధించిన పారుల్ చౌధరి కూడా బరిలో ఉంటుంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్, పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్స్ కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. రిలే ఈవెంట్లలోనూ భారత జట్లు పోటీ పడనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!