వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రెండు వారాలు కూడా నిలవలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ‘హనుమాన్ అంశ్’ అనే ఒక చిన్న సినిమా ఏకంగా 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు రికార్డు కలెక్షన్లు సాధించి అల్టిమేట్ గా కంటెంటే కింగ్ అని మరోసారి ఈ సినిమా నిరూపించింది. సెప్టెంబర్ 26న థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘హనుమాన్ అంశ్’, 51వ రోజున భారీ వసూళ్లను నమోదు చేసింది. Sacknlq నివేదిక ప్రకారం, ఈ చిత్రం 51వ రోజున రూ. 6.26 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ. 350 కోట్లకు చేరుకున్నాయి. ఇక వీకెండ్ కావడంతో ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరగ వచ్చని తెలుస్తోంది.
మొదట ఫ్లాప్, ఆ తర్వాత సూపర్ హిట్
ఆసక్తికరంగా ‘హనుమాన్ అంశ్’ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొదటి రెండు వారాల్లో కూడా కేవలం రూ. 1.50 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే మౌత్ టాక్ బాగుండడంతో మూడో వారం నుంచి ఈ సినిమా వసూళ్లు అమాంతం పెరిగాయి. నాలుగవ వారం నుంచి ప్రతి వారం రూ. 60 కోట్లకు పైగా వసూలు చేస్తున్న ఈ చిత్రం ‘ధురందర్ 2’, ‘బోర్డర్ 2’ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తర్వాత ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా నిలిచింది.
‘హనుమాన్ అన్ష్’ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తల్లి మరణానంతరం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి, ఆ తర్వాత నీమ్ కరోలీ బాబాగా ఎదిగిన లక్ష్మీనారాయణ్ అనే యువకుడి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించగా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి
హనుమాన్ అంశ్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి