సాధారణంగా తల్లి బిడ్డలకు పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఆవు, లేదా గేదె పాలను తాగించి బిడ్డలను పెంచుతారు. అమృతంతో సమానమైన పాలను కొందరు అక్రమార్కులు ధనాశ కోసం విషతుల్యం చేస్తున్నారు. పాడి పశువుల నుంచి అధికంగా, సులభంగా పాలు పిండేందుకు నిషేధిత ‘ఆక్సిటోసిన్’ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా ఉపయోగిస్తూ అటు ప్రజారోగ్యంతో, ఇటు మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సాధారణంగా ఆవులు, గేదెలు ఈనిన తర్వాత తమ దూడను చూసినప్పుడే ‘మిల్క్ లేట్ డౌన్’ అనే హార్మోన్ సహజంగా విడుదలై పాలు ఇస్తాయి. అయితే దూడ చనిపోయినా లేదా పాలు ఇవ్వడానికి మొండికేసినా.. పాలు పిండడానికి పది నిమిషాల ముందు ఈ ఆక్సిటోసిన్ సూదిమందులను ఇస్తున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రోజూ దాదాపు 10 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుండగా, ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఆక్సిటోసిన్ ఇచ్చిన పశువుల పాలు తాగడం వల్ల పాలు తమ సహజ సమతుల్యతను కోల్పోతాయి. పాలను మరిగించినప్పటికీ ఈ రసాయన అవశేషాలు పూర్తిగా నశించవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు చిన్న వయస్సులోనే తలెత్తుతాయి. పెద్దల్లో నరాలు, కండరాల బలహీనత, నిద్రలేమి, ఒత్తిడి, గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్ ముప్పునకు కారణవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. పాడి పశువు లకూ.. అనర్థాలు తప్పవం టున్నారు. ఈ ఇంజెక్షన్ల వల్ల పశువుల ఎముకలు తీవ్రంగా బలహీనపడతాయి. గర్భాశయ సమస్యలు తలెత్తి రెండేళ్లకు ఒకసారి కూడా దూడలను కనలేని స్థితికి చేరుకుంటాయి. పశువుల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతిని వాటి ఆయుర్దాయం సగానికి పైగా తగ్గిపోతుంది. ఈ సూదిమందు వల్ల కలిగే భయంకర పరిణామాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2018లోనే ఆక్సిటోసిన్ వాడకం, విక్రయం ఇంకా నిల్వలపై పూర్తి నిషేధం విధించింది. అయినప్పటికీ, అక్రమార్కులు బిహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డిదారిన వీటిని తెప్పించి, అమాయక పాడి రైతులకు ఆశ చూపి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ అధికారులు కేవలం అవగాహన సదస్సులకే పరిమితం కాకుండా, ఈ నకిలీ మందుల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కేంద్రం కొత్త నిబంధనలు
The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు