Headlines

Uttarakhand: ఉత్తరఖాండ్‌కి భారీ వర్ష సూచన.. నిలిచిపోయిన చార్ ధామ్ యాత్ర


Uttarakhand: ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధ చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గంగోత్రి, యమునోత్రి ,కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర పుణ్యక్షేత్రాల మార్గాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యాత్రను నిలిపివేశారు యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ వెల్లడించారు.

వాతావరణ శాఖ, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, ఎత్తైన ప్రాంతాల్లో మంచు, కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని యాత్రికుల భద్రత కోసం గర్వాల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాగేశ్వర్, పిథోరాఘర్, డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, హరిద్వార్ మొదలైన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. కేదార్‌నాథ్ యాత్రకి హెలికాప్టర్ సేవలు కూడా నిలిపివేయబడ్డాయి.

భారీ వర్షాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం యాత్రికులకు అడ్వైజరీ జారీ చేసింది. సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని, వాతావరణం మెరుగైన తర్వాతే ముందుకు వెళ్లాలని. స్థానిక పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పాటించాలని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *