ఇందులో ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి. వెల్లుల్లి, చింతపండులోని తడి పోవడం వల్ల పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
పూర్తిగా చల్లారిన అవిసె గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి, ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో వేయించుకున్న ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకును వేయాలి. వెల్లుల్లి, చింతపండును పక్కన పెట్టుకోవాలి.