సావిత్రి, సౌందర్యల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది లయ. వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల పాటు కథానాయికగా రాణించింది. అయితే పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. చాలా ఏళ్ల పాటు అక్కడే ఉన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని నెలల క్రితమే ఇండియాకు వచ్చింది. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. తమ్ముడు, సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని, వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్ వంటి సినిమాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సహాయక నటిగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న లయ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తన పెళ్లి సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను బయట పెట్టింది.
‘నా పెళ్లి రిసెప్షన్‌కు ఓ పెద్ద డైరెక్టర్ని పిలిస్తే ఆయన రాలేకపోయారు. ఇండస్ట్రీలో ఆయనకు చాలా మంచి గుర్తింపు ఉంది. అయితే కొన్ని కారణాలతో ఆయన రాలేకపోవడంతో ఒక గిఫ్ట్‌లా పార్శిల్ పంపించారు. ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉన్నాయి. అందులో ఒక లెటర్ కూడా రాసిపెట్టారు. నేను నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అప్పుడు ఇవ్వలేకపోయాను. నీ పెళ్లి టైంలో అయినా ఇస్తున్నాను. ఇది నా పెళ్లి గిఫ్ట్ అనుకో, దీవెనలు అనుకో అని రాసి ఉంది. ఆ మాటలు చదివి నేను షాకయ్యాను. నేను ఆయనను ఏమీ అడగలేదు. అప్పటికే సినిమా రిలీజై మూడు నాలుగేళ్లు అయిపోయింది. రెమ్యునరేషన్ సంగతి కూడా మర్చిపోయాను. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నాను, నాతో అసలు పనిలేదు. కానీ ఆయనంతట ఆయనే ఫీలై.. ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదని పంపించడం మంచి విషయమే కదా’ అని లయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. లయకు ఆ డబ్బుల కవర్ పంపిన దర్శకుడు ఎవరబ్బా? అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు
ఇవి కూడా చదవండి
అయితే లయ ప్రస్తావించిన ఈ విషయంలోని ఆ ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్ అని తెలుస్తోంది. 2004లో విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వరాభిషేకం’లో లయ హీరోయిన్గా చేసింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇవ్వలేకపోయిన మిగిలిన పారితోషికాన్ని.. 2006లో లయ పెళ్లి చేసుకున్న టైంలో పూర్తిగా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
వినాయక చవితి వేడుకల్లో నటి లయ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.