Headlines

BiggBoss 10: స్టార్, స్టార్డమ్ ఊరికే రాదు.. కెప్టెన్ అయిన ముఖేష్.. అపూర్వకు ఇమ్యూనిటీ పవర్


నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే అపూర్వ, మిథిలేష్ చేతికి కీలక పవర్ రావడం. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అపూర్వ, మిథిలేష్‌లకు బిగ్ బాస్ ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్లలో ఇద్దరిని తొలగించే అవకాశం కల్పించాడు. అయితే ఎవరిని ఎందుకు తొలగిస్తున్నారో సరైన కారణాలు చెప్పాలని సూచించాడు. ముందుగా మిథిలేష్ ఝాన్సీ పేరును ప్రస్తావించగా.. అపూర్వ మాత్రంశ్రిష్టిని టార్గెట్ చేసింది. శ్రిష్టికి సహనం తక్కువగా ఉంటుందని అపూర్వ చెప్పుకొచ్చింది. గతంలో సుధీర్‌తో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. అతడిని దూషించిన తీరు, చెత్తతో కొట్టిన వ్యవహారం వంటి అంశాలను ఆమె కారణాలుగా చెప్పింది. సుధీర్ చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని మిథిలేష్ కూడా అన్నాడు. ముఖ్యంగా ఫ్రీడం అనే పదాన్ని సుధీర్ ఎందుకు ఉపయోగించాడో కూడా వివరించే అవకాశం ఇవ్వలేదని మిథిలేష్ చెప్పుకొచ్చాడు.  వారి వాదనలకు వర్షిణి కూడా మద్దతుగా స్పందిస్తూ సూపర్ అంటూ అభినందించింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరోవైపు రోహిత్ కూడా మిథిలేష్, అపూర్వ వాదనలపై ప్రశ్నలు కురిపించాడు. గతంలో ముఖేష్‌ను అటెన్షన్ లేదని విమర్శించి.. ఇప్పుడు అమన్ విషయంలోనూ అదే కారణం చెబుతున్నారని ప్రశ్నించాడు. అయితే అమన్ విషయంలో సమస్య వేరే విధంగా ఉందని అపూర్వ, మిథిలేష్ వివరించారు. అమన్ అవసరం లేకుండా ఫైర్ అయ్యాడని, కొన్ని సందర్భాల్లో స్క్రీన్ స్పేస్ కోసం అలా చేస్తున్నట్టుగా అనిపించిందని ఇద్దరూ అన్నారు. దీంతో రోహిత్, అమన్ సహా పలువురితో మిథిలేష్, అపూర్వ మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే అగ్ని పరీక్షలో జరిగిన విషయాలను కూడా అమన్ ప్రస్తావించాడు. అక్కడ అపూర్వ వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ ఆమెను విమర్శించాడు. దానికి అపూర్వ కూడా గట్టిగానే ఇచ్చింది. అగ్ని పరీక్షలో అమన్ ఏం చేశాడో తనకు కూడా తెలుసంటూ కౌంటర్ ఇచ్చింది.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఇక కెప్టెన్సీకి సంబంధించిన అసలు పోటీ చివర్లో మొదలైంది. అపూర్వ, ముఖేష్ ఒక టీంగా.. ఝాన్సీ, మిథిలేష్ మరో టీంగా ఏర్పడి టాస్క్‌లో పాల్గొన్నారు. టాస్క్‌లో రెండు టీమ్‌లు పోటీపడగా.. చివరికి అపూర్వ, ముఖేష్ టీమ్ విజయం సాధించింది. దీంతో ముఖేష్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కగా.. అపూర్వకు ఇమ్యూనిటీ లభించింది. టాస్క్‌లో గెలిచిన తర్వాత ముఖేష్ చేసిన కామెంట్స్ కూడా హౌస్‌లో హైలైట్‌గా నిలిచాయి. స్టార్, స్టార్డమ్ ఊరికే రాదు అంటూ చరణ్‌కు కౌంటర్ ఇచ్చాడు. ముఖేష్ విజయం సాధించడంతో వర్షిణి గ్యాంగ్ సంబరాల్లో మునిగిపోయింది. మరోవైపు అపూర్వకు ఇమ్యూనిటీ రావడంతో ఆమెకు కూడా ఇది కీలక విజయంగా మారింది. మొత్తంగా అపూర్వ ఎంట్రీతో మొదలైన ఎపిసోడ్.. వరుసగా జరిగిన గొడవలు, పవర్ గేమ్, కెప్టెన్సీ టాస్క్, చివరికి ముఖేష్‌కు కెప్టెన్సీ.. అపూర్వకు ఇమ్యూనిటీ దక్కడంతో ఆసక్తికరంగా ముగిసింది.

ఇవి కూడా చదవండి



స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *