Headlines

ఆ హీరో అంటే పడి చచ్చిపోయేదాన్ని.. కానీ నువ్వు నాకు చెల్లెలి లాంటిదానివి అన్నాడు..


ఒకప్పుడు తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు ఎంతోమంది. ముఖ్యంగా 90వ దశకంలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు నటీమణులు.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు దూరమయ్యారు. మరికొందరు మాత్రం వరుస అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే అప్పట్లో కుర్రాళ్లలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓ హీరోయిన్ మాత్రం పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆమె ఎవరో కాదు.. మహేశ్వరి. ఈ ముద్దుగుమ్మ పేరు చెబితే ఇప్పటి తరం ప్రేక్షకుల్లో కొందరికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘గులాబీ’, ‘పెళ్లి’ సినిమాలు అనగానే ఆమె ముఖం మాత్రం టక్కున గుర్తొస్తుంది. తన క్యూట్ లుక్స్, సహజమైన నటన, అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పట్లో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది మహేశ్వరి.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

1995లో విడుదలైన అమ్మాయి కాపురం సినిమాతో మహేశ్వరి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ‘గులాబీ’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మహేశ్వరికి ఒక్కసారిగా గుర్తింపు పెరిగింది. గులాబీలో ఆమె కనిపించిన తీరు, నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వరుసగా పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వడ్డే నవీన్ సరసన నటించిన ‘పెళ్లి’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మహేశ్వరి కెరీర్‌లో మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కొన్నేళ్ల పాటు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగిన మహేశ్వరి.. చివరకు సినిమాలకు దూరమైంది.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

కాగా గతంలో  జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరించిన జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో మహేశ్వరి పాల్గొని తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా మహేశ్వరి తనకు తమిళ స్టార్ హీరో అజిత్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అజిత్‌తో కలిసి తాను ఓ సినిమాలో నటించానని, షూటింగ్ సమయంలో ఆయనపై క్రష్ ఏర్పడిందని సరదాగా వెల్లడించింది. అయితే తన మనసులో ఉన్న విషయాన్ని అజిత్‌కు చెప్పేలోపే సినిమా షూటింగ్ చివరి రోజుకు చేరుకుందని మహేశ్వరి చెప్పింది. అదే సమయంలో అజిత్ తన దగ్గరకు వచ్చి ఆమె నటనను మెచ్చుకున్నారని.. నీ వర్క్ నాకు చాలా నచ్చింది. భవిష్యత్తులో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు’ అని అజిత్ చెప్పడంతో తాను ఎంతో సంతోషించానని మహేశ్వరి గుర్తుచేసుకుంది. కానీ ఆ తర్వాత అజిత్ చెప్పిన మాటతో తనకు షాక్ తగిలిందని సరదాగా చెప్పింది. అజిత్ తనను ‘నువ్వు నాకు చెల్లెలి లాంటిదానివి’ అని అనడంతో.. అప్పటివరకు తన మనసులో ఉన్న క్రష్ కాస్తా ఒక్కసారిగా బ్రదర్-సిస్టర్ రిలేషన్‌గా మారిపోయిందని మహేశ్వరి నవ్వుతూ తెలిపారు.

ఇవి కూడా చదవండి



స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

Ajith

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *