Headlines

AC Remote Buttons: ఏసీ రిమోట్‌లో ఈ బటన్స్ ఎందుకు? అసలు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!


AC Remote Buttons: ఏసీ రిమోట్ కేవలం గదిని చల్లబరచడానికి మాత్రమే కాకుండా, అనేక ఇతర ఉపయోగకరమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ బటన్స్ పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చు మరియు మెరుగైన సౌకర్యాన్ని పొందవచ్చు.

  1. కూల్ మోడ్: ఇది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. గదిని చల్లబరుస్తుంది. ఈ మోడ్‌లో పవర్ బిల్ సాధారణంగా మధ్యస్థం నుండి ఎక్కువగా ఉంటుంది.
  2. డ్రై మోడ్: ముఖ్యంగా వర్షాకాలంలో లేదా సముద్ర తీర ప్రాంతాల్లో గదిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మోడ్ ఉపయోగపడుతుంది. ఇది గదిలోని తేమను తగ్గిస్తుంది. సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.
  3. ఫ్యాన్ మోడ్: ఈ మోడ్‌లో కేవలం ఇండోర్ యూనిట్ ఫ్యాన్ మాత్రమే పనిచేస్తుంది. కానీ గది కూల్ అవ్వదు. ఇది కేవలం గాలి ప్రసరణ కోసం ఉపయోగపడుతుంది.
  4. ఆటో మోడ్: ఈ మోడ్‌ని ఎంచుకుంటే గది ఉష్ణోగ్రతను బట్టి ఏసీ స్వయంచాలకంగా సరైన మోడ్‌ను (కూల్, ఫ్యాన్ లేదా డ్రై) ఎంచుకుంటుంది.
  5. టర్బో మోడ్: ఈ ఆప్షన్‌ను ఎంచుకోగానే ఏసీ అత్యధిక వేగంతో పనిచేసి 10-15 నిమిషాల్లో గదిని వేగంగా చల్లబరుస్తుంది. అయితే, ఈ మోడ్‌లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది.
  6. క్వైట్/సైలెంట్ మోడ్: రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ మోడ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్యాన్, కంప్రెసర్ నుండి వచ్చే శబ్దాన్ని తగ్గిస్తుంది.
  7. క్లీన్/ఆటో క్లీన్ మోడ్: ఈ ఫీచర్ ఏసీ ఇంటర్నల్ యూనిట్‌ను శుభ్రం చేస్తుంది. లోపల ఉన్న తేమను తొలగిస్తుంది. బ్యాక్టీరియా ఏర్పడకుండా నిరోధించి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఈ ఉపయోగకరమైన ఫీచర్లను అర్థం చేసుకోవడం ద్వారా మీ ఏసీని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *