Headlines

‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై విరుచుకుపడుతూ మరో స్ట్రాంగ్‌ అల్టిమేటం జారీ చేశారు. ఈసారి ఇరాన్‌కు నరకం చూపిస్తానంటూ వార్నింగ్‌ ఇవ్వడం హీట్‌ పెంచుతోంది. అటు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌ చేసిన కామెంట్స్‌ ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఏకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరు మార్చి ప్రసంగించడం చర్చకు దారి తీస్తోంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా మారారు. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ వాతావరణం, ఉక్రెయిన్ పరిణామాల మధ్య ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఇరాన్ ప్రపంచానికే అతిపెద్ద ముప్పుగా మారిందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశాన్ని పూర్తిగా ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు ట్రంప్‌ పిలుపునిచ్చారు. అణ్వాయుధాల తయారీని ఆపేసి, ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకునే వరకు ఇరాన్‌పై కఠిన ఆర్థిక దిగ్బంధం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒప్పందానికి వచ్చి పశ్చిమాసియాలోనే గొప్ప దేశంగా ఎదుగుతారా?.. లేక ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా నాశనమైపోతారా? తేల్చుకోవాలని ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరు మార్చేశారు డొనాల్డ్‌ ట్రంప్‌. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరు తీసేసి సూపర్‌ ఇంటెలిజెన్స్‌ అని నామకరణ చేశారు. AIప్లేస్‌లో SIని తీసుకొచ్చారు. ఈ సూపర్‌ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించేందుకు అంతర్జాతీయంగా ఎవరైనా కూటమిగా ఏర్పడితే, ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై ప్రసంగించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక విప్లవం కన్నా, ఇంటర్‌నెట్‌ కన్నా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు ట్రంప్‌. మొత్తంగా.. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ కఠిన హెచ్చరికలు.. AIపై కొత్త విధానంపై ప్రసంగం.. రెండూ ప్రధానంగా నిలిచాయి. అయితే.. ట్రంప్‌ హాట్‌ కామెంట్స్‌ వేళ ఇరాన్ విషయంలో దౌత్యానికి అవకాశం ఉందా.. లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా?.. అన్నది అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Paradise Review: ది ప్యారడైస్‌కు దిష్టి తగిలింది! సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే

వేధింపులు తట్టుకోలేను.. విషమిస్తే నేనే చచ్చిపోతా

జానీ మాస్టర్‌ వైఫ్‌కు.. దిమ్మతిరిగే షాక్

మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ

ఐఫోన్‌కు స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ అక్కర్లేదు!ఎందుకంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *