Headlines

రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. వడ్డీ లేకుండా రూ.50వేల వరకు లోన్స్!


ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎఫ్‌సీవీ(FCV) పొగాకు రైతులకు ప్రతి బార్న్‌కు రూ.50వేల వరకు ఉచితంగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో వచ్చే పంట నష్టం, ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులకు ఊరటకల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో రైతులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారం నుంచి పొగాకు రైతులకు తక్షణ ఉపశమనం లభిస్తోంది. సాధారణంగా ఎఫ్‌సీవీ పొగాకు రైతులు పంట సాగు, క్యూరింగ్ ప్రక్రియ, బార్న్ నిర్వహణకు పెట్టుబడి భారీగా అవుతుంది. ఇంత పెట్టుబడి పెట్టినా వాతావరణం కనుక అనుకూలంగా లేకపోతే పంట దెబ్బతిని తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుంది.

ఈ కారణంగా ఎఫ్‌సీవీ రైతులు ఎక్కువగా నష్టపోతూ.. అప్పల ఊబిలో పడిపోతూ ఉంటారు. వాటిని తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. కానీ ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి వస్తే రైతులకు అప్పుల బాధ తగ్గుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ వడ్డీ వ్యవాపారస్తులపై ఆధారాపడాల్సిన పని ఉండదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *