Headlines

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!


వాహనం అనేది సామాన్య ప్రజల కల, దీనిని కొనుగోలు చేయడానికి ఎంతో శ్రమ పడతారు. అలాంటి వాహనం చోరీకి గురైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఓ వైపు ఆర్థిక భారం, మరోవైపు వాహనం దొరుకుతుందో లేదో తెలియక యజమానులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను సులభంగా గుర్తించేందుకు టీజీ ఈ-టికెట్‌ (TG E-Ticket) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా చోరీకి గురైన వాహనం సులభంగా దొరుకుతుంది, అంతేకాకుండా దొంగలను కూడా కటకటాల వెనక్కి నెట్టొచ్చు. ట్రాఫిక్ పోలీసులు, శాంతిభద్రతల విభాగం సిబ్బంది ఈ యాప్‌ను ఉపయోగించి తనిఖీలు నిర్వహిస్తారు. అనుమానాస్పద వాహనాన్ని ఫొటో తీసినప్పుడు, అది చోరీకి గురైనదైతే, యాప్ వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఈ యాప్ 90కి పైగా చోరీ వాహనాలను గుర్తించింది. వాహనం చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం చాలా ముఖ్యం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. హైదరాబాద్‌ ర్యాపిడో డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..

రైలు కంపార్ట్‌మెంట్‌లో భయానక దృశ్యం!

దసరాకు ఏపీ – తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *