రెంటల్ ఇన్కమ్ : మీ ఇంట్లో ఖాళీగా ఉన్న గది, తరచూ వాడని బైక్, కారు లేదా కెమెరా వంటి విలువైన వస్తువులను సరైన నియమ నిబంధనలతో అద్దెకు ఇవ్వడం ద్వారా అసెట్ మీకోసం సంపాదించేలా చేయవచ్చు.
డివిడెండ్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో కేవలం షేర్ల విలువ పెరిగితేనే కాకుండా.. మంచి లాభాల్లో ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా అవి ఇచ్చే త్రైమాసిక లేదా వార్షిక డివిడెండ్ల రూపంలో స్థిరమైన పాసివ్ ఆదాయం పొందవచ్చు.
ఫ్రీలాన్సింగ్ : రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కోడింగ్, థంబ్‌నెయిల్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి ఉపయోగకరమైన నైపుణ్యాలు ఉంటే.. వారాంతాల్లో కేవలం 2-3 గంటలు కేటాయించి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టుల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
డిజిటల్ ప్రొడక్ట్స్ / ఆన్లైన్ కోర్సులు: “మేక్ వన్స్.. సెల్ మెనీ టైమ్స్” ఒక్కసారి తయారు చేసి వేల సార్లు అమ్మే కాన్సెప్ట్ ఇది. ఈ-బుక్స్, రెడీమేడ్ డిజైన్ టెంప్లేట్లు, నోట్స్ లేదా ఒక స్కిల్‌కు సంబంధించిన కోర్సులను రూపొందిస్తే నిరంతరం సేల్స్ వస్తుంటాయి.
అఫిలియేట్ మార్కెటింగ్: మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, బ్లాగ్ లేదా ఆన్లైన్ ఫాలోయింగ్ ఉంటే.. ప్రజలకు ఉపయోగపడే నాణ్యమైన ఉత్పత్తులను మీ అఫిలియేట్ లింక్ ద్వారా రికమండ్ చేస్తూ కమిషన్ పొందవచ్చు.
బాండ్స్ & పీర్ టు పీర్ లెండింగ్: అదనంగా ఉన్న నగదును ప్రభుత్వ/కార్పొరేట్ బాండ్లలో లేదా రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందిన P2P ప్లాట్‌ఫామ్‌లలో ఇన్వెస్ట్ చేసి సురక్షితమైన వడ్డీ ఆదాయం పొందవచ్చు.
సెల్ఫ్ సర్వీస్ / వెండింగ్ మెషీన్స్: కస్టమర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రైమ్ లొకేషన్లలో కాఫీ మెషీన్లు, వాటర్ డిస్పెన్సర్లు వంటి సెల్ఫ్ సర్వీస్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తే సిబ్బంది లేకుండానే అవి లాభాలను తెచ్చిపెడతాయి.
రికరింగ్ ఇన్కమ్ మోడల్: ఇది వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన ప్రిన్సిపుల్. ప్రతి నెలా కొత్త కస్టమర్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా.. సబ్స్క్రిప్షన్ లేదా సర్వీస్ ద్వారా ఒకే కస్టమర్ మళ్లీ మళ్లీ కొనుగోలు చేసేలా సిస్టమ్ నిర్మించడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కు అసలైన రాజమార్గం!







