Headlines

ఫామ్‌లో ఉన్నప్పుడే సెటిల్ అయ్యేలా హీరోయిన్స్ ప్లాన్స్


ఫామ్‌లో ఉన్నప్పుడే సెటిల్ అయ్యేలా హీరోయిన్స్ ప్లాన్స్

కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని చూస్తుంటారు. ఇందుకోసం సినిమాలకు గుడ్‌బై చెప్పడానికి కూడా సిద్ధపడతారు. అయితే, ఆ ప్రణాళికలు విఫలమైన హీరోయిన్లు మాత్రం మరింత దృఢ నిశ్చయంతో తమ కెరీర్‌లో డబుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఈ కోవలోకి నయనతార, త్రిష, నివేదా పేతురాజ్ వంటి నటీమణులు వస్తారు. రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమాల్లో అగ్ర కథానాయకగా కొనసాగుతున్న నయనతార ఒక దశలో సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత యాక్టింగ్ ని పక్కన పెట్టాలనుకున్నారు. కానీ ఆ వివాహం రద్దవ్వడంతో, మళ్లీ సినిమాల మీద పూర్తి దృష్టి సారించారు. గతంతో పోలిస్తే మరింత ఫోకస్‌డ్‌గా వర్క్ చేసి టాప్ ప్లేస్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం విగ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె అదే రేంజ్‌లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. త్రిష కథ కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. వరుణ్ మనియన్ అనే నిర్మాతను పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకున్న ఆమెకు నిశ్చితార్థం రద్దవడంతో కెరీర్‌పై మళ్ళీ దృష్టి సారించారు. నివేదా పేతురాజ్ సైతం దుబాయ్ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం రద్దయ్యాక వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఈ తారలు వ్యక్తిగత వైఫల్యాలను వృత్తిపరమైన విజయాలకు సోపానంగా మార్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *