ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మూడు రోజుల తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఇది మరింత బలపడి ఈ నెల 22న తీవ్ర వాయుగుండంగా మారి, 23న ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
డిసెంబర్ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
మెగాస్టార్ కెరీర్లో మరో మైల్స్టోన్
ఆస్కార్ 2027కు భారత్ అధికారిక ఎంట్రీ: మరాఠీ చిత్రం గోంధల్