Headlines

Ranabaali : ఏముందీ భయ్య ఈ సాంగ్.. రణబాలి నుంచి అందమైన మెలోడీ రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే..


టాలీవుడ్ హిట్‌ పేయిర్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి “ఏందయ్యా స్వామి” అనే ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అజయ్-అతుల్ ద్వయం అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరి జానపద శైలి, ఆధునిక మెలోడీ స్వరాల కలబోతగా రూపొందిన ఈ పాట వినగానే శ్రోతలను ఆకట్టుకుంటోంది. “ఏందయ్యా స్వామి ఇంతగా గాస్తాంది ఎన్నెలా ఊపేస్తా ఉంది” అంటూ సాగే సాహిత్యం భావోద్వేగమైన ప్రేమను, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మికల జోడీ ఈ పాటలో మరోసారి అలరించింది. పాటలో వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘రణబాలి’ పాత్రకు తగ్గట్టుగా నటీనటుల గెటప్‌లు, విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

పాటలోని లిరిక్స్ , మ్యూజిక్ ఆర్కేస్ట్రేషన్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ మ్యూజికల్‌గాను, కథారూపంలోనూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఏందయ్యా సామీ సాంగ్..



ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *