న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నటుడు రాఘవ్ జుయల్. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ది ప్యారడైజ్ చిత్రంలో బాలీవుడ్ యాంకర్, నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న విక్రమ్ మాలిక్ పాత్రలో కనిపించనున్నారు.
సోమవారం జరిగిన ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయా షేర్ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులు ఇరగదీశారు. ఈ ఈవెంట్‌లో తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌ను ఊపేసారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని “ఆయా షేర్” పాటకు ఆయన చేసిన ఎనర్జెటిక్ డ్యాన్స్ , తన ట్రేడ్‌మార్క్ స్లో మోషన్ స్టెప్పులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆయన డ్యాన్స్ మూవ్స్ చూసి ప్రాంగణమంతా ఈలలు, కేరింతలతో హోరెత్తిపోయింది.
ఆ తర్వాత సుమతో రాఘవ్ చేసిన సరదా వ్యాఖ్యలు, కామెడీ టైమింగ్ అందరినీ నవ్వించాయి. సుమ అడగడంతో “ఏషనాగుల కట్ట మీద” అనే జానపద పాటకు రాఘవ్ తనదైన శైలిలో సుమతో కలిసి స్టెప్పులేయడం విశేషం. వీరిద్దరి డ్యాన్స్ చూసి నేచురల్ స్టార్ నాని , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాఘవ్ జుయల్ మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమలోకి ‘ది ప్యారడైజ్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2014లో ‘సోనాలి కేబుల్’తో వెండితెరకు పరిచయమైన రాఘవ్, ‘అభయ్’ వెబ్ సిరీస్ ద్వారా తొలిసారి నెగెటివ్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
రాఘవ్ జుయల్..
CHHOTA MAALIK BRINGS THE SWAG! 🔥🕺
@TheRaghav_Juyal & @ItsSumaKanakala dance to Yeshanagula at the #TheParadise Grand Pre-Release Event ❤️🔥⚡
GRAND RELEASE WORLDWIDE ON 24⋆09⋆26 https://t.co/m4lbcyApWb
— THE PARADISE (@TheParadiseOffl) September 21, 2026
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..