Headlines

UPSC మాక్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థికి ప్రశ్నల వర్షం.. టాపర్ యశ్‌ వర్ధన్‌ ధీటైన సమాధానాలు! దడపుట్టించే సీన్


UPSC సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో AIR 212 ర్యాంక్‌ సాధించిన యశ్‌ వర్ధన్‌ సింగ్‌ పాల్గొన్న ఓ మాక్‌ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఇంటర్వ్యూలో దీపక్‌ వోహ్రా అభ్యర్థిని సూటిగా ప్రశ్నలు అడుగుతూ, ఒత్తిడిలోనూ నిజాయితీగా, స్పష్టంగా సమాధానం చెప్పగల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆయన ప్రశ్నలు అడిగిన విధానంకి ఏమాంత్రం భయపడకుండా యశ్‌ వర్ధన్‌ సింగ్‌ చురుగ్గా సమాధానాలు చెప్పారు.

‘భారత్‌లో డాక్టర్ల కొరత ఉందా?’

ఇంటర్వ్యూలో భాగంగా దీపక్‌ వోహ్రా.. ‘భారతదేశంలో డాక్టర్ల కొరత ఉందా? లేక డాక్టర్లు చాలా ఎక్కువగా ఉన్నారా?’ అని యశ్‌ వర్ధన్‌ సింగ్‌ను ప్రశ్నించారు. దీనికి అభ్యర్థి మొదట ‘సర్‌, నా ఉద్దేశంలో ఇది పంపిణీకి సంబంధించిన ప్రశ్న’అని సమాధానం ఇచ్చారు. అయితే ఇంటర్వ్యూయర్‌ నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. ‘నేను నిన్ను ఒక సులువైన ప్రశ్న అడిగాను. నీ సమర్థన నాకు అవసరం లేదు. మనకు కొరత ఉందా లేదా?’ అని ప్రశ్నించారు. దీంతో అభ్యర్థి ‘సర్‌, మనకు కొరత ఉంది’ అని స్పష్టంగా సమాధానం ఇచ్చారు.

‘రాజకీయంగా సరైన సమాధానం చెప్పొద్దు’

అభ్యర్థి నుంచి స్పష్టమైన సమాధానం వచ్చిన అనంతరం దీపక్‌ వోహ్రా.. ‘ఆ మాట మొదట్లోనే ఎందుకు చెప్పలేకపోయావు?’ అని ప్రశ్నించారు. అనంతరం అభ్యర్థి ఇంటర్వ్యూ బోర్డుతో రాజకీయంగా సరైనదిగా ఉండేందుకు ప్రయత్నించకూడదని సూచించారు. ‘నాతో రాజకీయంగా సరైనదిగా ఉండటానికి ప్రయత్నించకు. ఇది ఒక బోర్డు. నీ నిజాయితీగా ఉండే సామర్థ్యాన్ని నేను అంచనా వేయబోతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి



హిప్పోక్రటిక్‌ ప్రమాణం గురించి ప్రశ్న

అభ్యర్థి తాను నిజాయితీగా ఉండగలనని భావిస్తున్నారా అని ఇంటర్వ్యూయర్‌ ప్రశ్నించగా, యశ్‌ వర్ధన్‌ సింగ్‌ ‘అవును సార్‌’ అని సమాధానం ఇచ్చారు. అనంతరం ‘నువ్వు చేసిన ప్రమాణం ఏంటి?’ అని అడగగా, అభ్యర్థి ‘హిప్పోక్రటిక్‌’ అని సమాధానమిచ్చారు.

ఇంటర్వ్యూలో ఏం పరీక్షిస్తారు?

ఈ మాక్‌ ఇంటర్వ్యూ ద్వారా UPSC సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా అభ్యర్థి ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటాడు, ఒత్తిడిలో ఎలా స్పందిస్తాడు, తన అభిప్రాయాన్ని ఎంత స్పష్టంగా వ్యక్తం చేయగలడు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా సులభమైన ప్రశ్నలకు అనవసరమైన వివరణలు ఇవ్వకుండా, ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వడం, తెలియని విషయాల్లో ఊహాగానాలు చేయకుండా నిజాయితీగా స్పందించడం వంటి అంశాలు ఇంటర్వ్యూలో కీలకంగా మారుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *