Headlines

RRB NTPCలో 3,477 గ్రాడ్యుయేట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2026 విడుదల.. అక్టోబర్‌ 8 నుంచి దరఖాస్తులు


హైదరాబాద్‌, సెప్టెంబర్ 22: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 3,477 గ్రాడ్యుయేట్‌ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (NTPC) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 8న ప్రారంభమై నవంబర్‌ 6న ముగియనుంది. పూర్తి నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు, ఖాళీల వివరాలను RRB వెల్లడించనుంది. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అదనపు అర్హతలు లేదా టైపింగ్‌ నైపుణ్యం అవసరం కావచ్చు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి. గ్రాడ్యుయేట్‌ కేటగిరీలో ప్రధానంగా ఈ కింది పోస్టులు ఉంటాయి..

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీలో భర్తీ చేసే పోస్టులు ఇవే..

  • చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌
  • స్టేషన్‌ మాస్టర్‌
  • గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌
  • జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌
  • సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌
  • ట్రాఫిక్‌ అసిస్టెంట్‌

ముఖ్యమైన వివరాలు..

  • మొత్తం ఖాళీలు: 3,477
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 8
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 6
  • అర్హత: డిగ్రీ
  • కేటగిరీ: RRB NTPC Graduate Level



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *