Headlines

The Paradise: ది పారడైజ్‌కు A సర్టిఫికెట్.. 21 కట్స్‌తో సెన్సార్ షాక్.. ఆ సీన్లు లేపేశారుగా


నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది పారడైజ్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. సినిమాకు సంబంధించిన సెన్సార్ అప్‌డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు  A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాకుండా సినిమాలోని పలు సన్నివేశాలు, డైలాగ్స్‌పై మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. ది పారడైజ్’లోని హింసాత్మక సన్నివేశాలు, అభ్యంతరకరంగా ఉన్న కొన్ని డైలాగ్స్, అలాగే నాని పాత్రకు సంబంధించిన ఓ టాటూపై సెన్సార్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో మేకర్స్ సెన్సార్ సూచనలకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలను తొలగించడంతో పాటు, కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేశారట. అలాగే ప్రేక్షకులకు అవసరమైన హెచ్చరికలను కూడా సినిమాలో చేర్చినట్లు సమాచారం. మొత్తంగా 21 మార్పులు అలాగే కట్స్ తర్వాత సినిమాకు A సర్టిఫికెట్ లభించింది.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

సెన్సార్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ది పారడైజ్  ఫైనల్ రన్‌టైమ్ 174 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల 54 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. దసరా సినిమాతో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ప్రేక్షకులపై క్యూరియాసిటీ. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మరోసారి కలిసి చేస్తున్న ‘ది పారడైజ్’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అణచివేతకు గురైన ఓ సమాజం తన హక్కుల కోసం తిరుగుబాటు చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రా, రస్టిక్ ట్రీట్‌మెంట్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కీలక ఆకర్షణగా ఉండనుంది. నాని పాత్రను కూడా గత చిత్రాలతో పోలిస్తే మరింత భిన్నమైన, ఇంటెన్స్ షేడ్స్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేశారు. ది పారడైజ్ ను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు మొత్తం 8 భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి సినిమా విడుదలపైనే ఉంది. సెప్టెంబర్ 24న ది పారడైజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికెట్ రావడం, పలు కట్స్ ఉండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఇవి కూడా చదవండి



ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *