Headlines

రోబోల చేతికి కత్తెర? బార్బర్‌ ఉద్యోగాలూ గో..వింద!


ఏఐ.. ఇది అడుగుపెట్టని రంగం అంటూ లేదు. మొన్న ఓ మెషిన్‌ చకచకా గోరింటాకు పెట్టేసి మెహిందీ కళాకారులకు దడపుట్టించింది. ఇప్పుడు సెలూన్‌లోనూ అడుగుపెట్టేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకూ అలాగే అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక బార్బర్ ఒంటినిండా సెన్సర్లు, కెమెరాలు, వైర్లతో కూడిన మోషన్ క్యాప్చర్ సూట్ ధరించి హెయిర్‌కట్ చేస్తున్నాడు. అతడి చేతుల కదలికలు, కత్తెర తిప్పే విధానం, పనితీరును సెన్సర్లు రికార్డు చేస్తున్నాయి. ఈ డేటాను ఏఐ సిస్టమ్స్ లేదా రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారని సమాచారం. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేస్తూ.. “భారత్‌లో ఏఐ శిక్షణ జరుగుతోంది! త్వరలోనే బార్బర్ ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడొచ్చు” అని సరదాగా వ్యాఖ్యానిస్తూనే ఆలోచనలో పడేశారు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. మనుషుల శ్రమతో ఏఐకి ట్రైనింగ్ ఇచ్చి, చివరికి వారి ఉపాధినే దెబ్బతీయడం సరికాదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐకి ట్రైనింగ్ ఇస్తున్నందుకు బార్బర్లకు సరైన పారితోషికం ఇస్తున్నారో లేదో అని మరికొందరు ప్రశ్నించారు. అయితే, “సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చే రోబో కంటే, మనిషి చేతితోనే హెయిర్‌కట్ చేయించుకోవడం సేఫ్” అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న అల్పపీడనం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *