
దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, అలాగే తన తోటి నటీమణులతో తనకున్న అనుబంధం, పోటీ గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా రంగంలో తనకంటూ ఒక బలమైన ఇమేజ్ను నిర్మించుకోవడంలో పాత్రల ఎంపిక ఎంత కీలకమో ఆమె వివరించారు. ప్రస్తుతం కూడా తనను దృష్టిలో ఉంచుకొని పాత్రలు రాస్తున్నారని, ఇది చాలా అరుదైన విషయమని మీనా అన్నారు. ఒకప్పుడు నంబర్ వన్ నటిగా ఉన్న సమయంలో ఇలాంటి గుర్తింపు రావడం సహజమే అయినా, వివాహం, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనకై పాత్రలు రాసి, అవి చేయమని అడగడం తనను అదృష్టవంతురాలిని చేసిందని ఆమె పేర్కొన్నారు. ఒకానొక దశలో తానూ గ్లామర్ పాత్రలు చేయాలని ఆశపడ్డానని మీనా అన్నారు. గ్లామరస్ రోల్స్ చేసే వారికి లభించే అటెన్షన్, ప్రయారిటీ, ప్రాధాన్యతను చూసి తాను ఆశ్చర్యపోయానని, ఎందుకు తనకు అవి లభించడం లేదని తన తల్లితో కూడా చెప్పి ఏడ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
తనను ఎప్పుడూ సాఫ్ట్, డార్క్ హార్స్ ఇమేజ్‌తోనే చూసేవారని, గ్లామర్ హీరోయిన్స్‌కు ఉండే హంగామా తనకు లేదని ఆమె తెలిపారు. బహుశా తాను కూడా గ్లామర్ రోల్స్ చేస్తే తనకు ఆ ప్రాధాన్యత లభిస్తుందేమోనని ఒకప్పుడు భావించానని మీనా చెప్పారు. ఆ తర్వాత తన ఆలోచన మారిందని, తన పాత్రల ఎంపికే తన కెరీర్‌ను నిలబెట్టిందని మీనా స్పష్టం చేశారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తన పాత్రను గుర్తుపెట్టుకోవాలని, ఆ ప్రాధాన్యత తన క్యారెక్టర్‌కు ఉండాలని తాను ఎప్పుడూ కోరుకునేదానినని ఆమె అన్నారు. బయట హడావుడి, హంగామా కంటే ప్రజలు మనల్ని గుర్తుంచుకొని, గౌరవించడమే నిజమైన విజయమని ఆమె వివరించారు. గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ, తనకు ఒక కంఫర్ట్ లెవల్, లిమిట్ ఉండేవని మీనా పేర్కొన్నారు.
ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య
తనతోటి నటీమణులైన రమ్యకృష్ణ, రోజా, రంభ వంటి వారితో తీవ్రమైన పోటీ ఉండేదని మీనా వెఅన్నారు. ముఖ్యంగా రోజాతో తనకు టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీ ఉండేదని, ఒకరి వల్ల కాకపోతే మరొకరు సినిమాలు చేసేవారని, మీనా-రోజా కాంబినేషన్లో కవర్ పేజీలు కూడా వచ్చేవని గుర్తుచేసుకున్నారు. తర్వాత సౌందర్య, నగ్మా వంటి వారు కూడా వచ్చినా, తాను, రోజా, సౌందర్యలు కొంతవరకు పరిమితమైన పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చేవారమని మీనా అన్నారు. పని విషయంలో తనది ఎప్పుడూ పోటీతత్వం కలిగిన మనస్తత్వమని మీనా చెప్పారు. షూటింగ్‌కు వస్తే, పని విషయంలో బెస్ట్ ఇవ్వాలని, ఎదుటివారు ఏం చేస్తున్నారు, ఏం డ్రెస్ వేసుకున్నారు, తాను ఎలా బెస్ట్‌గా కనిపించాలి అనే ఆలోచన ఉండేదని ఆమె తెలిపారు.
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్ వేసుకున్నారు: దేవి ప్రసాద్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.