Headlines

అలా అనడానికి సిగ్గులేదా.. అసలు అక్కడకు వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!


ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు వైట్ వాష్‌కు గురైంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఘోర ఓటమి చవిచూసిన తరువాత బోర్డు ప్రక్షాళన చర్యలకు దిగింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed), బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ (Umar Gul) సహా సీనియర్ ఆటగాళ్లు మొహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), ఇమామ్ ఉల్ హక్ (Imam-ul-Haq) ఇలా మొత్తం ఏడుగురు ఆటగాళ్లను అర్ధాంతరంగా స్వదేశానికి పంపించివేశారు. అయితే మూడో టెస్టుకు ముందు జట్టులో ఇంత పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగడం తనకేమీ తెలియదని, అది తనకో కొత్త విషయమని కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు.

జట్టు నాయకుడిగా ఉంటూ ఈ విషయాలు తెలియకపోవడంపై వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఏం జరుగుతుందో అసలు తెలియకపోతే మీరెందుకు అక్కడ ఉన్నారంటూ, శెనగలు అమ్మడానికి వెళ్లారా ఏంటంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

ఇవి కూడా చదవండి



కెప్టెన్ తన ఆటగాళ్ల వెంటే నిలబడాలని, లేకపోతే వంద శాతం ఫలితం ఇవ్వలేరని అక్రమ్ అభిప్రాయపడ్డారు. షాన్ మసూద్ (Shan Masood) స్థానంలో గత జూలై నెలలో మళ్లీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజమ్, వెస్టిండీస్ (West Indies) టూర్‌లో జట్టును సమర్థంగా నడిపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నిలిచినా, ఇంగ్లాండ్ టూర్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టెస్టు ముగిసిన తరువాతే బాబర్ కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!

అనవసరంగా మళ్లీ పగ్గాలు చేపట్టి ఈ వివాదాలను కొనితెచ్చుకున్నాడని అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు సైతం బాబర్ ఆజాంను కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బాబర్ నాయకత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *