Headlines

జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం.. ఇదిగో వీడియో


హిందూపురంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక కోలాహలం నడుమ సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ​హిందూపురం రైల్వే రోడ్డులో ఏర్పాటు చేసిన 50 అడుగుల భారీ ‘గరిడి గణేష్’ విగ్రహ శోభాయాత్ర కంటికి రెప్ప వేయని రీతిలో సాగింది. గరిడి గణేష్ కమిటీ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయి, స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కమిటీ సభ్యులు ఈ వేడుకను చారిత్రాత్మకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో బెంగళూరు నుండి ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించి స్వామివారిపై ఘనంగా పూల వర్షం కురిపించారు.

హెలికాప్టర్ ద్వారా సాగిన ఈ వినూత్న పూల వర్షాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్ పరిసర ప్రాంతాలన్నీ భక్తజనసందోహంతో కిటకిటలాడాయి. ​ఆకాశం నుంచి హెలికాప్టర్ గణపతి విగ్రహం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ, గాలిలో చక్కర్లు కొడుతూ పూల వర్షం కురిపిస్తున్నంత సేపు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయింది.

వీడియో చూడండి..

‘జై గణేశా.. జై జై గణేశా’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో హిందూపురం పుర వీధులు మారుమోగిపోయాయి. స్వర్ణోత్సవాల వేళ సాగిన ఈ అద్భుత ఘట్టం హిందూపురంలో అందరిని ఆకర్షించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *