Headlines

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ చేసుకుని తాగారంటే..


జలుబు, తీవ్రమైన దగ్గు, జ్వరం ఉన్నప్పుడు వేడివేడిగా పీతల సూప్‌ తాగడం ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుందని డాక్టర్ పద్మిని వివరించారు. పీతల రసంలో విటమిన్ B12, విటమిన్ C, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. శీతాకాలం, వర్షాకాలంలో వచ్చే కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి మరియు శరీరానికి అవసరమైన ప్రోటీన్, శక్తిని అందించడానికి పీతల రసం ఒక అద్భుతమైన సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.

పోషకాల గని – పీతల సూప్‌:

పీతలలో నాణ్యమైన ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ C, జింక్, ఐరన్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. జ్వరం లేదా ఇన్ఫెక్షన్ వచ్చి శరీరం బలహీనపడినప్పుడు, ఈ పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

జలుబు, దగ్గుకు పీతల రసం ఎలా పనిచేస్తుంది?:

పీతల రసం తయారుచేసేటప్పుడు మనం ఉపయోగించే నల్లమిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మరియు పసుపు వంటి మసాలా దినుసులు సహజమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తాయి. ఇవి ఊపిరితిత్తులు, ఛాతీలో పేరుకుపోయిన మొండి కఫాన్ని పల్చగా మార్చి బయటకు పంపడానికి తోడ్పడతాయి. పీతలలో ఉండే జింక్, సెలీనియం శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీనివల్ల వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో శరీరం వేగంగా పోరాడగలుగుతుంది.

ఇవి కూడా చదవండి



పీతల జ్యూస్‌లో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు గొంతులో ఉండే మంట, బొంగురుపోవడం, నొప్పులను తగ్గిస్తాయి. వేడివేడిగా ఈ రసాన్ని తాగడం వల్ల శ్వాసకోశ మార్గం తెరుచుకుని శ్వాస తీసుకోవడం సులువవుతుంది. జ్వరం వచ్చినప్పుడు నాలుక రుచి కోల్పోయి, ఆకలి మందగిస్తుంది. పీతల సూప్‌లోని ఘాటు, రుచి నాలికకు మళ్లీ రుచిని తేవడమే కాకుండా జీర్ణక్రియను వేగవంతం చేసి ఆకలిని పెంచుతాయి.

ఎలా తీసుకోవాలి?:

పీతలను బాగా శుభ్రం చేసి దంచి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, టమోటాలతో కలిపి పలుచగా రసం కాచుకోవాలి. ఈ రసాన్ని వేడివేడిగా తాగడం లేదా వేడి అన్నంలో కలుపుకుని తినడం వల్ల జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొంది ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *