Headlines

డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్..


ఖమ్మం – హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి డాక్టర్ దుర్మరణం చెందారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఖమ్మంలోని మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్‌గా సేవలందిస్తున్న కాసకుర్తి జగదీశ్ (50) కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పిల్లలమర్రి సమీపానికి రాగానే ఆయన కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్దమైంది.. దీంతోపాటు.. అందులో ప్రయాణిస్తున్న జగదీశ్ సజీవ దహనమయ్యారు.

అయితే, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరించామన్నారు. ప్రమాదం ఎలా జరిగింది.. కారు అదుపుతప్పడానికి కారణమేంటి? అనే అంశాలతోపాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

కాగా హైవేపై కారు ప్రమాదానికి గురైన సందర్భంలో అక్కడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. కారు వస్తూనే.. పక్కకు వెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది.. అనంతరం మంటలు చెలరేగాయి..

వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ అకాల మరణంతో కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *