దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా బియ్యం, చక్కెర ధరలు పెరగనున్నాయి. అంతేకాదు, ఉల్లితో పాటు కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎల్ నినో’ ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా ఈ ఏడాది వరి దిగుబడి భారీగా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈసారి వరి ఉత్పత్తి దాదాపు 10 మిలియన్ టన్నులు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. 2009-10 నాటి ఎల్ నినో పరిస్థితి తర్వాత పదేళ్లలో తొలిసారిగా వరి సాగు క్షీణించడం ఇదే మొదటిసారి. దీనివల్ల దేశీయంగానే కాక, విదేశాలకు ఎగుమతి అయ్యే బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. థాయ్‌లాండ్, వియత్నాంలలో బియ్యం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. మరోవైపు చక్కెర ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చెరకును ఇథనాల్ తయారీకి విస్తృతంగా వాడటమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచినప్పటికీ ధరలు అదుపులోకి రావడం లేదు. ఇక మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. కేంద్రం బఫర్ స్టాక్ విడుదల చేస్తున్నా ఫలితం పెద్దగా కనిపించడం లేదు. వీటితో పాటు వంట నూనెలు, అల్లం, వెల్లుల్లి, పప్పుధాన్యాలు, గోధుమల ధరలు కూడా మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రవాణా వ్యయాన్ని పెంచి, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ పరిణామాలన్నీ కలిసి దేశంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కవల పిల్లల తల్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!
ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే
Tirumala: తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు