Headlines

చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..


ఖగోళ పరిశోధనల్లో నాసా శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిగమించారు. చంద్రుని ఉపరితలంపై ఇప్పటివరకు నమోదైన వాటిలోనే అత్యంత పెద్దదైన, సరికొత్త బిలాన్ని గుర్తించారు. 2024 ఏప్రిల్ 11 నుంచి మే 22 మధ్య కాలంలో ఓ భారీ అంతరిక్ష శిల చంద్రుడిని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ క్రేటర్ ఏర్పడిందని నాసా తెలిపింది. ఈ సరికొత్త బిలానికి నాసా మాజీ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త టామ్ మెక్‌గెచిన్ పేరు పెట్టారు. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) పంపిన డేటాను పరిశీలిస్తుండగా ఇమేజ్-ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ రాబర్ట్ వాగ్నర్ తొలిసారిగా దీనిని గమనించారు. పాత, కొత్త శాటిలైట్ చిత్రాలను సరిపోల్చి, 2025 ఆగస్టులో బిలాన్ని గుర్తించి, ఈ ఏడాది ప్రారంభంలో ధ్రువీకరించారు. భూమికి కనిపించే వైపున ఏర్పడిన ఈ బిలం సుమారు 728 అడుగుల వెడల్పు, 141 అడుగుల లోతు ఉంది. అంటే దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల వెడల్పు, మూడు స్కూల్ బస్సులను ఒకదానిపై ఒకటి నిలబెడితే ఎంత ఎత్తు ఉంటుందో అంత లోతులో విస్తరించి ఉంది. గతంలో ఎల్‌ఆర్‌ఓ గుర్తించిన బిలాల కంటే ఇది మూడు రెట్లు పెద్దది. ఇలాంటి ఘటనలు ప్రతి 132 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే జరుగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అంతరిక్ష శిల తాకిడి తీవ్రత వల్ల చంద్రుడి లోపలి పొరల్లోని మట్టి, రాళ్లు 100 కిలోమీటర్లకు పైగా ఎగిరిపడ్డాయి. ఊహించిన దానికంటే ఎక్కువ కోణంలో ధూళి పదార్థాలు వ్యాపించినట్లు పరిశోధకుడు మార్క్ రాబిన్సన్ పేర్కొన్నారు. ఈ పరిశోధనా పత్రం అంతర్జాతీయ జర్నల్ ‘సైన్స్ అడ్వాన్సెస్’లో ప్రచురితమైంది. చంద్రుడిపై వ్యోమగాముల కోసం శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నాసాకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపకరిస్తుంది. అంతరిక్ష శిలలు ఢీకొన్నప్పుడు ఎగిరిపడే పదార్థాలు ఎంత దూరం ప్రయాణిస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా, భవిష్యత్ వ్యోమగాముల నివాసాలు, పరికరాలకు ప్రమాదం లేకుండా రక్షణ గోడలు నిర్మించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, చంద్రుడి ఉపరితలం నిరంతరం తిరగబడుతుండటం వల్ల గతంలో అపోలో వ్యోమగాములు వేసిన అడుగుల ముద్రలు కూడా కాలక్రమేణా చెరిగిపోతాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే

Tirumala: తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గ్యాస్ సబ్సిడీ కోసం నో వెయిటింగ్!

ఇక..రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్

బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *