Headlines

ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి..! వైరల్ అవుతున్న నాన్‌వెజ్ రెస్టారెంట్ ఫన్నీ బోర్డ్


సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వింత విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ ముఖ్యంగా వెజ్, నాన్‌వెజ్ ప్రియుల మధ్య జరిగే సరదా పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా నాన్‌వెజ్ తినేవారికి శాకాహారులు ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ, ఈసారి ఒక నాన్‌వెజ్ రెస్టారెంట్ యజమాని రివర్స్‌లో శాకాహారులకే ఒక విచిత్రమైన, చమత్కారమైన లాజిక్‌తో కౌంటర్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్ ముందు పెట్టిన బోర్డు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తోంది.

శాకాహారం, మాంసాహారంపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే, ఒక నాన్‌వెజ్ రెస్టారెంట్ యజమాని ఏర్పాటు చేసిన వినూత్న బోర్డ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. శాకాహారులపై సరదాగా చమత్కరిస్తూ రాసిన ఈ విచిత్రమైన లాజిక్ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ బోర్డుపై ఏం రాసి ఉందంటే?

ఇవి కూడా చదవండి



వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక నాన్‌వెజ్ రెస్టారెంట్ బయట షవర్మా స్టాల్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న బోర్డుపై Dear Plant Eaters (ప్రియమైన శాఖాహారులారా) అని రాసి ఉంది. అందులో సదరు రెస్టారెంట్ యాజమాన్యం ఒక ఫన్నీ నోట్ రాసుకొచ్చారు. చికెన్ మనకు ఎప్పుడూ ఆక్సిజన్ ఇవ్వలేదు, మనకు నీడను ఇవ్వలేదు. చికెన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా పెరగలేదు. మరి అలాంటప్పుడు పచ్చని ఆకులు, కాయల కోసం చెట్లను, మొక్కలను ఎందుకు తింటారు? మొక్కలను వదిలేసి చికెన్ తినండి! పర్యావరణాన్ని కాపాడండి, భూమిని రక్షించండి!

ఈ విచిత్రమైన తర్కం చదివిన శాకాహారులకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. చెట్లు మనకు ఆక్సిజన్, నీడ ఇస్తాయి. కాబట్టి, వాటిని తినకుండా రక్షించాలి, చికెన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తినేయాలి అని రెస్టారెంట్ యజమాని చెప్తున్న సరదా లాజిక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియోను huzaifa_deraiya అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఇది లక్షలాది వీక్షణలు, వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఈ వ్యాపారి తెలివితేటలు చూస్తుంటే రేపు చందమామపై కూడా ప్లాట్లు అమ్మేలా ఉన్నాడు అని ఒకరు కామెంట్ చేయగా, ఇంతటి మార్కెటింగ్ ప్రతిభను ఎక్కడా చూడలేదు అని మరొకరు చమత్కరించారు. వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ రెస్టారెంట్ యజమాని వాడిన ఐడియా నిజంగా కేక అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *