Headlines

Gas Burner Cleaning Tips: గ్యాస్ బర్నర్లు జిడ్డుగా మారాయా? ఇలా చేస్తే తళతళ మెరిసిపోతాయ్‌..!


Gas Burner Cleaning Tips: ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ బర్నర్ రంధ్రాలు జిడ్డు, పాలు పొంగడం వల్ల పూడుకుపోతుంటాయి. దీనివల్ల గ్యాస్ మంట సరిగ్గా రాక, పసుపు రంగులోకి మారి పాత్రల అడుగున కరిపిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ కూడా ఎక్కువగా వృథా అవుతుంది. అయితే ఎలాంటి రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే వస్తువులతో బర్నర్లను కొత్తవాటిలా మెరిపించి, మంట పెద్దగా వచ్చేలా చేసే కొన్ని సులభమైన చిట్కాలు ఇవే:

1. వెనిగర్, బేకింగ్ సోడా:

కావలసినవి: వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, వేడి నీళ్లు, పాత టూత్ బ్రష్.

చేసే విధానం: ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని, అందులో ఒక కప్పు వెనిగర్ కలపండి. గ్యాస్ బర్నర్లను అందులో ముంచి 20-30 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బర్నర్లపై బేకింగ్ సోడా చల్లి, పాత టూత్ బ్రష్‌తో బాగా రుద్దండి. రంధ్రాలలో పేరుకుపోయిన మురికి అంతా వదిలిపోయి బర్నర్లు శుభ్రపడతాయి.

2. నిమ్మకాయ,ఈనో

చేసే విధానం: ఒక పాత్రలో వేడి నీళ్లు తీసుకుని అందులో ఒక పాకెట్ ఈనో (Eno) పౌడర్ లేదా బేకింగ్ సోడా వేయండి. దానితో పాటు ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని అందులో పిండండి. ఈ నీటిలో బర్నర్లను 15-20 నిమిషాలు ఉంచండి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, ఈనో కలిసి బర్నర్ మీది మొండి జిడ్డును, కరిని త్వరగా వదిలిస్తాయి. అనంతరం స్క్రబ్బర్‌తో రుద్ది మంచి నీటితో కడిగేయాలి.

3. నిమ్మ ఉప్పు:

చేసే విధానం: మీరు వెనిగర్ వాడకూడదు అనుకుంటే, వేడి నీళ్లలో 2 స్పూన్ల నిమ్మ ఉప్పు వేసి బర్నర్లను నానబెట్టవచ్చు. ఇది బర్నర్‌పై ఉన్న నల్లటి పొరను తొలగించి రాగి/పిత్తడి (Brass) మెరుపును తిరిగి తెస్తుంది.

4. రంధ్రాలు క్లియర్ చేయడం:

బర్నర్లను నీళ్లలో నానబెట్టిన తర్వాత, ఒక సన్నటి పిన్ లేదా వైర్ తీసుకుని బర్నర్ చుట్టూ ఉన్న చిన్న చిన్న రంధ్రాలను క్లీన్ చేయండి. దీనివల్ల లోపల ఇరుక్కుపోయిన డస్ట్ బయటకు వచ్చి గ్యాస్ ఫ్లో సీర్‌గా వచ్చి మంట పెద్దగా వస్తుంది.

ముఖ్యమైన జాగ్రత్తలు:

పూర్తిగా ఆరనివ్వాలి: బర్నర్లను శుభ్రం చేసిన వెంటనే గ్యాస్ స్టవ్‌పై పెట్టకూడదు. తడి ఆరిపోయే వరకు ఎండలో లేదా పొడి గుడ్డతో బాగా తుడిచి ఆరబెట్టాలి. క్రమం తప్పకుండా శుభ్రం చేయండి: ప్రతినెలా ఒకసారి ఈ పద్ధతిని పాటిస్తే గ్యాస్ వృథా కాకుండా ఆదా అవుతుంది, వంట కూడా త్వరగా పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: Compound Walls: ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే గోడ బీటలు వారడం ఖాయం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *