Headlines

IND vs JAP: జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరో తెలుసా?


India vs Japan T20I: ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా, ఇప్పుడు తదుపరి వరుస సిరీస్‌లలో తలపడనుంది. ముందుగా జపాన్‌తో ఈ నెల 22న, ఆ తర్వాత ఒలంపిక్స్, అలాగే వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా ఆడనుంది. అయితే, ప్రధానంగా ఈ నెల 22న జపాన్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఇందుకోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా టీ20 జట్టు జపాన్‌కు బయలుదేరింది.

జపాన్‌కు వెళ్లనున్న టీమిండియా టీ20 జట్టు జెర్సీ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. జపాన్‌తో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌కి, అలాగే ఆసియా క్రీడల మ్యాచ్‌లకు తేడా ఉందని స్పష్టమైంది. ఈ మ్యాచ్ ఆసియా క్రీడలకు సంబంధం లేని స్నేహపూర్వక మ్యాచ్ కావడంతో, భారత ఆటగాళ్లు సాధారణ బీసీసీఐ జెర్సీతోనే ఆడనున్నారు. ఇక ఆసియా క్రీడలకు సంబంధించి మాత్రం సపరేట్ జెర్సీని టీమిండియా ధరించనుంది. దీంతో ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లు అయింది.

ఎక్కువమంది చదివినది: Team India: పరుగెత్తలేడు, డైవ్ చేయలేడు.. టీమిండియాలో అత్యంత వరస్ట్ ఫీల్డర్ అతనే..!

ఇవి కూడా చదవండి



ఇక ఈ నెల 22న జరగబోయే జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆసియా క్రీడలలో పాల్గొనే టీమిండియా జట్టే జపాన్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీని ఆడించలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని మేనేజ్‌మెంట్ వైభవ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే, జపాన్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు జరగనున్నాయి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: Team India: అందరికీ న్యాయం చేశారు.. కానీ, ఆ ఒక్కడినే ఎందుకు బలి చేశారు గంభీర్ జీ..!

అంతేకాదు, జపాన్ చిన్న జట్టు కావడంతో జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా రెస్ట్ ఇవ్వనున్నారు. ఇది యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకోవడానికి చక్కటి అవకాశంగా నిలవనుంది. ఇక ఆసియా క్రీడల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి కీలక జట్లతో తలపడనున్న నేపథ్యంలో, బలమైన ప్లేయింగ్ ఎలెవెన్‌తోనే బరిలోకి దిగనుంది. అంటే, ఆసియా క్రీడలకు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అలాగే బుమ్రాలతో కూడిన బలమైన ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. కానీ, చిన్న జట్టు అయిన జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లో మాత్రం వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, వైభవ్ సూర్యవంశీలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ద్వారా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం దక్కించుకోనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *