Headlines

ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వట్లేదని ఆ హీరోకు చెప్తే అది మీ సమస్య అన్నాడు.. తర్వాత ఆయన చేసింది చూసి షాకయ్యా.. సమీర్..


ప్రముఖ నటుడు సమీర్ ఓ ఇంటర్వ్యూలో నటుడు అజిత్ కుమార్ అసలు వ్యక్తిత్వాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో వివరించారు. ఒక పాత షూటింగ్ సంఘటనను వివరిస్తూ, అజిత్ కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఒక గొప్ప నాయకుడని (తల) నిరూపించుకున్నారని సమీర్ వెల్లడించారు. రెడ్ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను సమీర్ గుర్తు చేసుకున్నారు. ప్రొడక్షన్ యూనిట్‌లో పనిచేసే డ్రైవర్లు, ఇతర సిబ్బందికి చాలా కాలంగా ప్రొడ్యూసర్ నుండి జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సమీర్ విన్నారు. ఈ సమస్యను అజిత్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, ఆయన మొదట వారిని “ఇది మీ సమస్య, నాకేం సంబంధం? ప్రొడ్యూసర్‌ను అడగండి” అని చెప్పి పంపించేశారంట. అజిత్ అందరికీ సహాయం చేసే వ్యక్తి అని తెలిసినందున, ఆయన స్పందన చూసి సిబ్బంది షాక్ అయ్యారు. అయితే, కొన్ని గంటల తర్వాత, అజిత్ మేకప్ రూమ్‌లో లేరు. కో-డైరెక్టర్ పిలవడానికి వెళ్ళినప్పుడు, అజిత్ హోటల్‌కు వెళ్ళిపోయారని తెలిసింది. అక్కడ ఆయన ప్రొడక్షన్ మేనేజర్‌ను పిలిచి, సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించారంట. అవసరమైతే, ఆ డబ్బులు తానే చెల్లిస్తానని, అవి క్లియర్ అయ్యే వరకు షూటింగ్ చేయనని అజిత్ స్పష్టం చేశారని సమీర్ తెలిపారు. నిర్మాతను నేరుగా ఇబ్బంది పెట్టకుండా, నిశ్శబ్దంగా కార్మికులకు సహాయం చేయాలనే అజిత్ తత్వాన్ని సమీర్ ఎంతగానో ప్రశంసించారు. ఇది అజిత్ అద్భుతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఈ సంఘటనతో పాటు, సమీర్ తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన విలువలను కూడా పంచుకున్నారు. తన భార్య తనను ఎప్పుడూ న్యాయం కోసం నిలబడమని, తప్పును ప్రశ్నించమని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఒకసారి బైక్ డ్యామేజ్ అయినప్పుడు కూడా, తన భార్య “ఎందుకు వదిలేస్తావ్, వాడిని పట్టుకో” అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. స్నేహం , వృత్తి పూర్తిగా వేర్వేరు అని సమీర్ నమ్ముతారు. తాను స్నేహితుల నుండి అవకాశాలను అడగడం తన తత్వానికి విరుద్ధమని తెలిపారు. తన అత్యంత సన్నిహితుడు జూనియర్ ఎన్టీఆర్ (తారక్) విషయంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తానని చెప్పారు. తారక్‌తో చాలా సంవత్సరాలుగా సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, తాను ఎప్పుడూ ఆయనను ఒక అవకాశం అడగలేదని స్పష్టం చేశారు. కుటుంబం, పిల్లలు వచ్చిన తర్వాత మిత్రులకు వారి వ్యక్తిగత స్థలాన్ని ఇవ్వడం ముఖ్యమని, అందుకే పాత స్నేహాలు మారవచ్చని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

అలాగే, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర తారలతో ఎలా స్నేహాన్ని కొనసాగిస్తున్నారని అడగగా, సమీర్ తాను తారక్‌ను కలిసి నేరుగా చరణ్‌ను కలవగలనని, లేదా ఒకరితో సినిమా చేసి మరుసటి రోజు మరొకరితో సినిమా చేయగలనని చెప్పారు. నటీనటుల మధ్య అభిమానులు అనుకున్నంత వైరుధ్యాలు ఉండవని, తన వ్యక్తిత్వం తెలిసిన వారు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

సమీర్, అజిత్..

Sameer, Ajith

Sameer, Ajith

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *