Headlines

2.7 సెకన్లలో 100 కి.మీ వేగం.. టయోటా వెల్‌ఫైర్‌‌కి షాకిచ్చేందుకు దూసుకొస్తున్న BYD


లగ్జరీ కార్ల మార్కెట్‌లో ఇప్పటివరకు కొన్ని ప్రముఖ సంస్థల ఆధిపత్యం కనిపించింది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేలా BYD తన హై-ఎండ్ బ్రాండ్ Denzaను భారత్‌కు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రారంభంలో రెండు మోడళ్లను తీసుకురావచ్చని తెలుస్తోంది. అందులో ఒకటి అత్యంత శక్తివంతమైన Z9 GT కాగా, మరోటి D9 Luxury MPV.

Z9 GT.. వేగం చూస్తే షాకవ్వాల్సిందే!

భారత్‌లో Denza నుంచి ముందుగా Z9 GT వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ రూపాల్లో లభించే ఈ మోడల్‌ను భారత్‌లో మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావచ్చని సమాచారం. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి ఏకంగా 1156 HP శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దాదాపు 2.9 టన్నుల బరువు ఉన్నప్పటికీ ఈ కారు పనితీరు అద్భుతంగా ఉంటుంది. కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 100 Km వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 270 Km వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 600 Km వరకు ప్రయాణించవచ్చని సమాచారం. ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

D9 MPVలో రాజసం..

Denza D9 Luxury MPV నేరుగా Toyota Vellfire వంటి అల్ట్రా-లగ్జరీ వాహనాలతో పోటీపడే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌లో 103kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 Km వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో వచ్చే ఈ మోడల్ ధర సుమారు రూ.80 లక్షల వరకు ఉండొచ్చు. 2 + 2 + 3 సీటింగ్‌తో వచ్చే ఇందులో ప్రయాణికుల సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఆడియో వ్యవస్థ, పూర్తి లెదర్ సీట్లు, మధ్య వరుసలో ఫోల్డ్-అవుట్ టేబుల్స్, ఎక్స్టెండబుల్ లెగ్ రెస్ట్‌లు వంటి సదుపాయాలు ఉండనున్నాయి. ఈ రెండు మోడళ్లతో భారత లగ్జరీ ఈవీ మార్కెట్‌లో పోటీ మరింత పెరగనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *