Headlines

ప్రధానమంతి మోదీకి UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ ఫోన్ కాల్.. ఏం చెప్పారంటే..?


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం (సెప్టెంబర్ 18) ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-యూఏఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కొత్త చర్యలపై చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.

అలాగే, న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించినందుకు UAE అధ్యక్షుడు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. భారత అధ్యక్షతన బ్రిక్స్‌లో UAE చురుకైన భాగస్వామ్యాన్ని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడాన్ని, UAE సహకారాన్ని మోదీ అభినందించారు.

ఇదే సమయంలో పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ, షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పరస్పర సహకారం, సమన్వయాన్ని కొనసాగించాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *