Headlines

House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? మీ అవసరానికి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకోండి!


House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? మీ అవసరానికి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకోండి!

సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ, చేతిలో ఉన్న డబ్బుతో ముందుగా ఖాళీ స్థలం లేదా ప్లాట్ కొనాలా? లేక నిర్మించిన ఇల్లు కొనాలా? అనే సందిగ్ధం చాలామందిలో ఉంటుంది. ప్లాట్ కొన్నా, ఇల్లు కట్టుకున్నా భవిష్యత్తులో అది లాభదాయకంగా ఉండాలి. కాబట్టి, మీ అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలు, బడ్జెట్‌ను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.

ప్లాట్ (ఖాళీ స్థలం) కొనుగోలు – లాభనష్టాలు:

చాలామంది భవిష్యత్తులో తమకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఖాళీ స్థలం కొంటుంటారు. అపార్ట్‌మెంట్లు లేదా నిర్మించిన ఇళ్ళ కంటే, భూమి విలువ చాలా వేగంగా పెరుగుతుంది. పెట్టుబడి పరంగా చూస్తే స్థలం కొనడం దీర్ఘకాలంలో అధిక లాభాలను ఇస్తుంది. అలాగే, మన ఇష్టానికి అనుగుణంగా ఎప్పుడైనా, ఎలాగైనా ఇల్లు నిర్మించుకునే స్వేచ్ఛ ఉంటుంది.

అదేవిధంగా.. స్థలం కొనడానికి బ్యాంకులు సులభంగా లోన్ ఇవ్వవు, ఇచ్చినా తక్కువ మొత్తంలో ఇస్తాయి. దీనిపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు లభించవు. పైగా, స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయడం, కబ్జా కాకుండా చూసుకోవడం వంటి మెయింటెనెన్స్ సమస్యలు ఉంటాయి.

నిర్మించిన ఇల్లు లేదా ఫ్లాట్ – లాభనష్టాలు:

రెడీ టు మూవ్ ఇల్లు కొనడం వల్ల వెంటనే అందులోకి మారవచ్చు. తద్వారా అద్దె కట్టే బాధ తప్పుతుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు బ్యాంకులు సులభంగా 80-85శాతం వరకు హోమ్ లోన్ ఇస్తాయి. అలాగే, అసలు, వడ్డీపై భారీగా టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. భవనం పాతబడేకొద్దీ దాని నిర్మాణ విలువ తగ్గుతుంది. దీనిలో మార్పులు చేయడానికి లేదా విస్తరించడానికి స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది.

వెంటనే ఇల్లు అవసరం లేని వారు, కేవలం పెట్టుబడి కోణంలో ఆలోచించే వారు ముందుగా స్థలం కొని పెట్టుకోవడం మంచి ఆప్షన్. అదే వెంటనే నివాసం ఉండాలనుకునే వారు, లోన్ సదుపాయం, పన్ను మినహాయింపులు కోరుకునే వారికి ఫ్లాట్ లేదా నిర్మించిన ఇల్లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *