Headlines

ఆసుపత్రి నుంచి డిస్కోశాంతి డిశ్చార్జ్


రియల్ స్టార్ శ్రీహరి భార్య, ప్రముఖ నటి డిస్కో శాంతి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెలైన్ బాటిళ్లతో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆమె చిత్రాలను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అయితే, డిస్కో శాంతే స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి చేరుకున్నానని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఉన్నట్టుండి ఆమె ఎందుకు ఆసుపత్రి పాలయ్యారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.డిస్కో శాంతి విషయానికి వస్తే, 90వ దశకంలో ఆమె హీరోయిన్‌గా కాకపోయినా ప్రత్యేక గీతాలతో అనూహ్యమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. బంగారు కోడిపెట్ట వంటి ఎన్నో విజయవంతమైన పాటల్లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు. రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత సినిమాలను తగ్గించారు. 2013లో శ్రీహరి మరణానంతరం ఆమె పూర్తిగా సినీ రంగానికి దూరమయ్యారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడుపుతున్నారు. అభిమానుల ప్రార్థనలతో డిస్కో శాంతి త్వరగా కోలుకోవడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బిగ్ బాస్‌ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది

నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్

నా 3 కోట్లు నాకు ఇప్పించండి…కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి

హాలీవుడ్‌లోకి మహారాజ్‌ మూవీ…హీరో ఎవరంటే?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *