Headlines

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌..తన న్యూ ట్యాలెంట్‌తో..అదరగొట్టేస్తున్న రేణు!


కెరీర్ ఆరంభంలో తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణు దేశాయ్, స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సుమారు మూడేళ్ల క్రితం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా, తన నటనతో అందరినీ ప్రభావితం చేశారు. తాజాగా, రేణు దేశాయ్ ఏకంగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా తనలోని కొత్త ప్రతిభను ప్రదర్శించారు. కాశీ మజిలీ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆమె రచయితగా మారారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో కథాసుధా పేరుతో స్ట్రీమ్ అవుతున్న వీక్లీ ఆంథాలజీ సిరీస్‌లో భాగంగా కాశీ మజిలీ మినీ మూవీ రిలీజ్ అయింది. యమునా కిషోర్ దర్శకత్వం వహించిన ఈ మినీ మూవీలో రేణు దేశాయ్ లీడ్ రోల్‌లో నటించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, మాటలను కూడా అందించారు. ఈ సరికొత్త టాలెంట్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బిగ్ బాస్‌ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది

నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్

నా 3 కోట్లు నాకు ఇప్పించండి…కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి

హాలీవుడ్‌లోకి మహారాజ్‌ మూవీ…హీరో ఎవరంటే?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *