Headlines

Gold Prices: బంగారం ధరలపై గగుర్పొడిచే న్యూస్..ఏకంగా రూ.25 లక్షలకు చేరుకుంటుందా..? ఎవరూ ఊహించని లెక్కలివే..


బంగారం ధరల్లో ప్రస్తుతం ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల క్రమంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగడం లేదు. ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్వల్పంగా పుంజుకుంటున్నాయి. రోజుకోకలా ధరలు కొనసాగుతుండటంతో భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది పెద్ద చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ధరలపై ఎవరి అంచనాలువారే వేసుకుంటున్నారు. కొంతమంది పెరుగుతుందని అంటుండగా.. మరికొంతమంది తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ బిజినెస్ అనలిస్టుల అభిప్రాయంగా కూడా భిన్నంగా ఉంది. అయితే బంగారం ధరలపై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి పసిడి ధరలపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. బంగారానికి డిమాండ్, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను విశ్లేషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

అసలు ఘట్టం ఇప్పుడే మొదలైంది..

బంగారం పరుగు ఇంకా పూర్తి కాలేదని, అసలు ఘట్టం ఇప్పుడే మొదలైందని రాబర్ట్ కియోసాకి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులు చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయని, ప్రపంచంలో ఎక్కడా కొత్త పసిడి గనులు, నిల్వలు గుర్తించలేదని అన్నారు. బంగారానికి డిమాండ్ పెరుగుతుండగా.. సరఫరా స్తంభించిపోయినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఔన్సు బంగారం విలువ 27 వేల డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేశారు. అంటే భారత కరెన్సీలో 30 గ్రాముల బంగారం రూ.25,89,000కి చేరుకుంటుందని విశ్లేషించారు. ప్రస్తుతం ధరలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ద్రవ్య సరఫరా, వివిధ దేశాల బంగారు నిల్వలను లెక్కించి అందులో కనీసం 40 శాతం ద్రవ్యానికి బంగారం మద్దతు ఇస్తే.. అసలు విలువ భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. జనవరిలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న తర్వాత పతనమవుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ.1.53 లక్షల వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల రేటు రూ.1.40 లక్షల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు చూస్తే..

అటు వెండి ధరలు చూస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో సిల్వర్ ధరలు రూ.2,49,900 వద్ద ట్రేడవుతున్నాయి. సిల్వర్ ధరలు జననవరిలో రూ.4 లక్షల గరిష్ట స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత నుంచి దిగొస్తున్నాయి. ప్రస్తుతం స్ధిరంగా ఒకచోట కొనసాగుతున్నాయి. బంగారంతో పోలిస్తే సిల్వర్‌కు డిమాండ్ కాస్త భిన్నంగా ఉంటుంది. బంగారాన్ని కేవలం ఆభరణాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ వెండిని పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *