Headlines

ముల్తానీ మట్టిలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిపుణుల సలహా ఏంటంటే..


చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టి, పటిక మిశ్రమానికి ప్రత్యేక స్థానం ఉంది. ముల్తానీ మట్టి చర్మంలోని అదనపు నూనెను, మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పటికలోని యాంటీసెప్టిక్, ఆస్ట్రింజెంట్ గుణాలు మొటిమలను, వాటి మచ్చలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఈ రెండింటి కలయిక ఫేస్ ప్యాక్‌గా వాడినప్పుడు ముఖంలో కలిగే మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

ముల్తానీ మట్టి – పటిక కలయిక ప్రయోజనాలు:

అదనపు నూనె నియంత్రణ: ముల్తానీ మట్టి చర్మంలోని సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నూనె చర్మ తత్వం ఉన్నవారికి ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్‌గా పనిచేస్తుంది.

మొటిమలు, మచ్చల నివారణ: పటికలో శక్తివంతమైన యాంటీబాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను కలిగించే బాక్టీరియాను నాశనం చేసి, పాత మచ్చలను క్రమంగా తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి



చర్మం బిగుతుగా మారడం : పటికలో సహజ ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న ఓపెన్ పోర్స్ పరిమాణాన్ని తగ్గించి, వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలను నివారిస్తుంది.

కాంతివంతమైన చర్మం: చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి ముఖానికి తక్షణ ప్రకాశాన్ని అందిస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి?:

ఒక గిన్నెలో ఒక స్పూన్ ముల్తానీ మట్టి పొడి తీసుకోండి. దానికి చిటికెడు పటిక పొడి కలపండి. ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ లేదా కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసి 10 నుండి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పటిక స్వభావరీత్యా చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ఉన్నవారు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు పటికను అతి తక్కువ పరిమాణంలో వాడాలి లేదా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత తప్పనిసరిగా మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం శ్రేయస్కరం. వారానికి ఒకసారి మాత్రమే ఈ ప్యాక్ ఉపయోగించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *