Headlines

Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..


Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి 2026 సెప్టెంబర్ 19 నాటికి నైరుతి రుతుపవనాలు వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం సౌరాష్ట్ర, పరిసర ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా ఉన్న అల్పపీడన కేంద్రం, డీసా, జైపూర్, ఆగ్రా, లక్నో, గయా, సాగర్ దీవి మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు వెళ్తోంది. ఈరోజు (2026 సెప్టెంబర్ 16) ఉదయం 08:30 గంటల సమయానికి ఉత్తర థాయ్‌లాండ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంపైకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి రానున్న 3-4 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ, పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతోంది.

వాతావరణ సూచన

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో పాటు  30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వర్షాల సమయంలో కరెంట్ స్తంభాలు, హోర్డింగ్ వద్ద ఉండవద్దని సూచించింది. రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచా వేసింది.

కాగా తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. మొన్నటివరకు ఎల్‌నీవో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో కాస్త ఊరట చెందుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్‌నివో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *