పదిరోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర 50 నుంచి 60 రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. అంటే తక్కువ వ్యవధిలోనే ఉల్లి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఉల్లి కొనుగోలు చేయాలంటే వినియోగదారులపై మరింత భారం పడుతోంది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో ఉల్లి ధరలు పెరగడంతో గృహిణుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఇప్పుడు ఉల్లి ధరల పెరుగుదల కూడా అదనపు భారంగా మారింది.