Headlines

జిమ్‌కు వెళ్లకుండా బరువు తగ్గిన స్టార్ హీరోయిన్.. ఆ పనితో ఊహించని రిజల్ట్ వచ్చిందట


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. ముఖ్యంగా పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం కోసం చాలామంది హీరోయిన్లు కఠినమైన వర్కౌట్స్, డైటింగ్‌ చేస్తుంటారు. కొందరు జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చి తమ ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. తాను ఎందుకు బరువు పెరిగానో తెలుసుకున్న తర్వాతే తన బరువు తగ్గించే ప్రయాణం మొదలైందని వెల్లడించింది. జిమ్ము గిమ్ము లేదు ఇంట్లో ఉండే బరువు తగ్గా అంటూ చెప్పుకొచ్చింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యా బాలన్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేస్తూ నటిగా తన సత్తా చాటుకుంది.

Hanuman Ansh: చాలా డబ్బులు వచ్చాయి.. వాటిని ఏం చేసుకోవాలో అర్ధంకావడంలేదు..: హనుమాన్ అంశ్ నిర్మాత

ముఖ్యంగా ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యా బాలన్‌కు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ ఈమెకు మంచి పరిచయమే ఉంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్: కథానాయకుడు సినిమాలో విద్యా బాలన్ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సినిమాల విషయంలో కొంత సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్న విద్యా బాలన్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలు, వీడియోలు, రీల్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. గతంలో తన బరువు, ఫిట్‌నెస్‌ గురించి ఎదుర్కొన్న విమర్శలపై విద్యా బాలన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి



వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

తన కెరీర్ బిగినింగ్ లో బరువు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని విద్యా బాలన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాను ఫిట్‌గా లేనంటూ పలువురు కామెంట్స్ చేశారని, బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదని తెలిపింది. అయితే ఆ తర్వాత ఒక న్యూట్రిషన్ టీమ్ ను సంప్రదించడంతో తన బరువు పెరగడానికి అసలు కారణం వేరే అని తెలుసుకున్నానని చెప్పింది విద్యా బాలన్. తాను ఊహించినట్టుగా కేవలం ఫ్యాట్ కారణంగానే బరువు పెరగలేదని, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కూడా ఒక కారణమై ఉండొచ్చని తెలుసుకున్నానని విద్యా బాలన్ పేర్కొంది. న్యూట్రిషన్ నిపుణుల సూచనలను పాటిస్తూ తన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నానని విద్యా బాలన్ తెలిపింది. ముఖ్యంగా తన శరీరానికి సరిపోయే ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టానని, దాని ఫలితంగానే క్రమంగా బరువు తగ్గినట్లు చెప్పింది.

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *