Headlines

మహిళా బైకర్ ను ఢీకొట్టి వెళ్లిన కారు .. వెంట పడొద్దని వారించినందుకే..


ఈ ప్రమాదంలో సియా రోడ్డుపై కిందపడిపోగా, ఆమె బైక్ కొద్ది దూరం వరకు జారుకుంటూ వెళ్లింది. ఈ భయానక దృశ్యాలన్నీ సియా బైక్‌కు ఉన్న యాక్షన్ కెమెరాలో రికార్డయ్యాయి.

వీడియో ఇక్కడ చూడండి

అదే సమయంలో సియా వెనుక వస్తున్న ఆమె స్నేహితులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారులో ఉన్న వ్యక్తి వాళ్లను బూతులు తిడుతూ, అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. ‘rebelwheels_sia_’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నడిపే సియా, ఈ ప్రమాదం గురించిన వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టింది. ఆ కారు ఢీకొట్టడానికి ముందు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే చెప్పింది. తనను దూరం వెళ్లమని చెప్పినందుకు కోపంతోనే ఆ వ్యక్తులు ఇలా ప్రవర్తించారని, ఆ సమయంలో వాళ్లంతా తాగి ఉన్నారని ఆమె చెప్పారు. రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి వారిపై గురుగ్రామ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా  స్పందించారు. గురుగ్రామ్‌లోని రద్దీగా ఉండే గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ప్రయాణిస్తున్న మహిళా బైకర్‌ను, ఒక కారు డ్రైవర్ కావాలనే వెంబడించి ఆమె వాహనాన్ని ఢీకొట్టాడనీ ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడిందనీ  ఈ ఘటనకు సంబంధించి సోమవారం  పోలీసులు వివరాలు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.  వీడియో ఆధారంగా ఘటన జరిగిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించామనీ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ, బాధితురాలు సియాను సంప్రదించి రాతపూర్వక ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

ప్రమాదానికి కారణమైన మారుతి సియాజ్ కారు (రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949) మనీష్ అనే వ్యక్తి పేరిట రిజిస్టర్ అయి ఉంది. అయితే తాను ప్రస్తుతం అస్సాంలో ఆర్మీలో విధుల్లో ఉన్నానని, ఆదివారం తన స్నేహితుడు కళ్యాణ్ కారును తీసుకువెళ్లాడని, ఆ సమయంలో అతనే డ్రైవింగ్ చేశాడని కారు యజమాని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో డిమాండ్లు

‘rebelwheels_sia_’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నిర్వహిస్తున్న సియా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. ప్రమాదం జరగడానికి ముందు రోడ్డుపై ఏం జరిగిందో ఆమె వివరంగా వివరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, నగరంలో మహిళా భద్రత,  రోడ్డు భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. గురుగ్రామ్ రోడ్లపై మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, నిర్లక్ష్యంగా కారుతో ఢీకొట్టి పారిపోయిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Newsmatic - News WordPress Theme 2026. Powered By BlazeThemes.