Headlines

SSC CGL 2026లో 12,256 ఉద్యోగాలు.. రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!


హైదరాబాద్‌, సెప్టెంబర్ 13: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన విడుదల చేసింది. 2026 సంవత్సరానికి నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించింది. మొత్తం 12,256 పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది. SSC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 30, 2026 వరకు Tier I కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనున్నారు.

SSC CGL 2026 టైర్ 1 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మూడు దశల్లో ఎంపిక

CGL 2026 నియామక ప్రక్రియలో అభ్యర్థుల ఎంపికను ప్రధానంగా Tier I, Tier II కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేపట్టనున్నారు. Tier Iలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన Tier II పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. Tier IIలో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తదుపరి నియామక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. చివరి దశలో అభ్యర్థుల విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు SSC CGL ఒక ముఖ్యమైన నియామక పరీక్ష. 12,256 పోస్టులకు అవకాశం ఉండటంతో ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు SSC అధికారిక ప్రకటనలో పేర్కొన్న సూచనలు, పరీక్షా విధానం, సిలబస్‌ను పూర్తిగా పరిశీలించి సిద్ధమవ్వడం మంచిది.

SSC CGL 2026 టైర్ 1 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *