Headlines

Love Astrology: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. వీరి ప్రేమ జీవితంలో కలతలు..జాగ్రత్త?


జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, ఆకర్షణ, అందం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు కారక గ్రహంగా భావిస్తారు. శుక్రుడి సంచారంలో మార్పులు వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితంతో పాటు ప్రేమ, వివాహం, ఆర్థిక అంశాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నమ్మకం. సెప్టెంబర్ 11న రాహువు అధిపత్యంలోని స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించనున్నారు. అక్టోబర్ 24 వరకు ఆ నక్షత్రంలోనే కొనసాగుతారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు సంబంధాలు, డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

సింహ రాశి

స్వాతి నక్షత్రంలో శుక్రుడి ప్రవేశంతో సింహ రాశి వారికి ప్రేమ జీవితంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. భాగస్వామి చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తమ మాటే నెగ్గాలనే పట్టుదలతో వ్యవహరించడం కంటే భాగస్వామి భావాలను గౌరవించడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రేమ, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మూడో వ్యక్తి మాటలను విని భాగస్వామిపై అనుమానాలు పెంచుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా కూడా ఖర్చులు, డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శుక్రుడి అనుగ్రహం కోసం ‘ఓం శుం శుక్రాయ నమః’ మంత్రాన్ని జపించడం శుభంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి



మీన రాశి

మీన రాశి వారికి ప్రేమ, దాంపత్య జీవితంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశముంది. ఇతరులు చెప్పే మాటలను నమ్మి జీవిత భాగస్వామిపై ఒక అభిప్రాయానికి రావడం సంబంధాల్లో సమస్యలను పెంచే అవకాశముంది. అందువల్ల ఏదైనా విషయంలో స్పందించే ముందు వాస్తవాలను తెలుసుకోవడం మంచిది. డబ్బు విషయంలోనూ ఖర్చులను నియంత్రించుకోవాలి. పెట్టుబడులు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి వాటిలోకి వెళ్లే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. బియ్యం, పాలు, చక్కెర వంటి తెల్లని వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

(గమనిక: ఇవి జ్యోతిష్య శాస్త్రంలోని సాధారణ నమ్మకాలు, అంచనాల ఆధారంగా రూపొందించిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, నక్షత్ర ప్రభావాలను బట్టి ఫలితాలు మారే అవకాశముంది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *