Headlines

IRCTC Thailand Tour: హైదరాబాద్ నుంచి Bangkok-Pattaya ట్రిప్.. 5 రోజుల టూర్‌ ప్యాకేజీ ధర ఇదే!


IRCTC Thailand Tour from Hyderabad Telugu: విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సీటీసీ టూరిజం ఆకర్షణీయమైన థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘Treasures of Thailand Ex-Hyderabad’ (SHO12) పేరుతో ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా నగరాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. 2026 అక్టోబర్ 28న హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభమై నవంబర్ 1న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్‌లో 30 మంది ప్రయాణికులను తీసుకెళ్లనున్నారు.

విమాన ప్రయాణం ఇలా..

  • అక్టోబర్ 28న ఇండిగో 6E-1067 విమానంలో హైదరాబాద్ నుంచి ఉదయం 11:05 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:10 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. విమానాశ్రయంలో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని హోటల్‌కు వెళ్తారు. అదే రోజు సాయంత్రం ‘చావో ఫ్రయా డిన్నర్ క్రూయిజ్’ ఆస్వాదిస్తారు.
  • రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ సందర్శిస్తారు. అక్కడే లంచ్ అనంతరం రాత్రి భోజనం చేసి హోటల్‌లో బస చేస్తారు.
  • మూడో రోజు బ్యాంకాక్ నుంచి పట్టాయాకు ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యలో గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ఆలయాలను సందర్శిస్తారు. పట్టాయా చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్‌ఇన్ చేసి సాయంత్రం ప్రసిద్ధ అల్కజార్ షోను వీక్షిస్తారు.
  • నాలుగో రోజు కోరల్ ఐలాండ్ టూర్ తో పాటు నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ సందర్శిస్తారు. లంచ్, డిన్నర్ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి బ్యాంకాక్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. లంచ్ అనంతరం సమయం ఉంటే షాపింగ్ స్టాప్‌లకు తీసుకెళ్లి, మధ్యాహ్నం 2 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుస్తారు. సాయంత్రం 5:10 గంటలకు 6E-1068 విమానంలో బయలుదేరి రాత్రి 7:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

సింగిల్ షేరింగ్‌కు ఒక్కరికి రూ.77,100, డబుల్ షేరింగ్‌కు రూ.68,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.68,300గా ధర నిర్ణయించారు. 2–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.66,050, బెడ్ లేకుండా రూ.59,350 చెల్లించాలి.

ప్యాకేజీలో ఏమున్నాయి?

రిటర్న్ విమాన టికెట్లు, 3 స్టార్ హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, కోరల్ ఐలాండ్, అల్కజార్ షో, నాంగ్ నూచ్ గార్డెన్, సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్, బ్యాంకాక్ సిటీ టెంపుల్ టూర్, చావో ఫ్రయా డిన్నర్ క్రూయిజ్, స్థానిక టూర్ గైడ్ సేవలు ప్యాకేజీలో ఉన్నాయి. 80 ఏళ్లలోపు భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు ప్రస్తుతం వీసా ఆన్ అరైవల్ ఉచితంగా అందుబాటులో ఉందని ప్యాకేజీ వివరాల్లో పేర్కొన్నారు. అయితే థాయ్‌లాండ్‌లో బస చేసే సమయంలో ఒక్కొక్కరికి కనీసం 10,000 THB, కుటుంబానికి 20,000 THB నిధులు ఉన్నట్లు నగదు రూపంలో చూపించాల్సి రావచ్చు.

పాస్‌పోర్ట్ తిరుగు ప్రయాణ తేదీ నుంచి కనీసం 6 నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. బుకింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, PAN కార్డు అవసరం. ప్యాకేజీ ధృవీకరణ తర్వాత రీఫండ్ ఉండదు. అలాగే హోటళ్లు, విమాన ఛార్జీలు, పన్నుల్లో మార్పులు జరిగితే అదనపు మొత్తాన్ని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ Treasures of Thailand Ex-Hyderabad టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *