Headlines

వార్ని.. ఇన్నిరోజులు తెలియలేదు..! బిగ్ బాస్ మైక్ బ్యాగ్‌లో ఏముంటాయో తెలుసా.!!


బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకొని 10 సీజన్ టెలికాస్ట్ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 10 రీసెంట్ గానే మొదలైంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, విభేదాలతో రచ్చ రచ్చగా సాగుతుంది. తొలి వారమే ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం 16మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇన్ని సీజన్స్ లో మనం హౌస్ మేట్స్ ను చూస్తుంటాం.. మేడలో ఎప్పుడు ఓ బ్యాగ్ వేసుకొని కనిపిస్తుంటారు. అయితే ఆ బ్యాగ్ ఒక మైక్ అని మనకు తెలుసు అయితే అంత పెద్ద బ్యాగ్ లో చిన్న మైక్ మాత్రమే కాదు ఇంకేముంటాయో తెలుసా.?

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

నిజానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ధరించే బ్యాగ్ ను ‘మైక్ ప్యాక్’ లేదా ‘ట్రాన్స్‌మిటర్ బ్యాగ్’ అని పిలుస్తారు. బిగ్ బాస్ ఒక రియాలిటీ షో కాబట్టి, కంటెస్టెంట్ పలికే ప్రతి ఒక్క మాట, చేసే అతి చిన్న శబ్దం కూడా స్పష్టంగా రికార్డ్ అవ్వాలి. దీనికోసం, ప్రతి ఒక్కరికీ వారి సొంత వైర్‌లెస్ మైక్రోఫోన్ ఇస్తారు. ఆ బ్యాగ్‌లో ట్రాన్స్‌మిటర్, మైక్ పనిచేయడానికి అవసరమైన పవర్ ఫుల్ బ్యాటరీలు ఉంటాయి. ఈ ప్యాక్ నుంచి, కంటెస్టెంట్ బట్టల కింద నుంచి, ఒక సన్నని తీగ వారి కాలర్‌కు లేదా ఛాతీకి తగిలించిన ఒక చిన్న మైక్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

హౌస్ లో కొన్నిసార్లు కంటెస్టెంట్స్ మాట్లాడే మాటలు పెద్ద వివాదాలకు దారితీయవచ్చు లేదా వారికి అభిమానులను సంపాదించి పెట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఇది షో రేటింగ్స్‌కు చాలా మంచిది. వారు మాట్లాడే మాటలు మంచివైనా, చెడ్డవైనా, అది బిగ్ బాస్‌కు అవసరమైన ప్రచారాన్ని దానంతట అదే రికార్డ్ చేసుకుంటుంది. ఇది ఇంతకాలం చూడని కొత్త ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుంది. షో నిర్వాహకులు కోరుకునేది కూడా సరిగ్గా ఇదే. అందుకే ఈ మైక్ ప్యాక్ అన్ని వేళలా వారి వద్ద ఉండాలి. సులభంగా చెప్పాలంటే, కంటెస్టెంట్స్ స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు తప్ప, మిగతా సమయమంతా ఈ బ్యాగ్‌ను ధరించి ఉండాలి.

ఇవి కూడా చదవండి



BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *