Headlines

మంటల్లో చిక్కుకున్న లారీ.. 200 మేకలు, డ్రైవర్‌ సజీవ దహనం! ఎక్కడంటే..


మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలను తరలిస్తున్న డీసీఎం వాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్‌తో పాటు సుమారు 200 మేకలు సజీవ దహనమయ్యాయి.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో..

అధికారుల వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జాతీయ రహదారి-44పై భూత్పూర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 150 నుంచి 200 మేకలను తరలిస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంలోని డీజిల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు భారీగా వ్యాపించడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలో ఉన్న మేకలు కూడా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డ్రైవర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి



హైదరాబాద్‌లోనూ ఇటీవల అగ్ని ప్రమాదాలు

ఇదిలా ఉండగా.. ఆగస్టు 23న హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ ప్రాంతంలో ఓ ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్‌ టెండర్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అలాగే మే 14న హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఫర్నిచర్‌ షాపులో మంటలు చెలరేగాయి.

రెండు ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకుని సుదీర్ఘంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మృతుడి వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *