బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పసిడి ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బంగారం ధరలు ప్రతీ రోజు మారుతూ ఉంటాయి. దీంతో రోజువారీ ధరలను చాలామంది తెలుసుకుంటూ ఉంటాయి. ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ధరలను పరిశీలిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 10వ తేదీన ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.1,55,510, 22 క్యారెట్ల రేటు రూ.1,42,550గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,510 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1200 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,42,550 పలుకుతోండగా.. నేడు రూ.1100 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొసాగుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,550 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,550 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది.
ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ ధర రూ.2.50 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.55 లక్షల వద్ద ఉండగా.. చెన్నైలో కూడా ఇదే ధర పలుకుతోంది. బెంగళూరులో గురువారం కేజీ సిల్వర్ రేటు రూ.2.55 లక్షల వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటింది. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల ఎప్పటివరకు ఉంటుందనేది చూడాలి.




