Headlines

Rohit Sharma: క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన హిట్ మ్యాన్.. టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు


Rohit Sharma: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఘనత రోహిత్ శర్మ సొంతం. 2017లో శ్రీలంకతో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని సంచలనం సృష్టించాడు. ఫుల్ మెంబర్ దేశాల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే మూడో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. సికిందర్ రజా, ఫిన్ అలెన్ మాత్రమే 33 బంతుల్లో సెంచరీలతో రోహిత్ కంటే ముందున్నారు. ఆనాటి మ్యాచ్‌లో రోహిత్ మొత్తం 43 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు బాది గ్రౌండ్ నలుమూలలా పరుగుల తుఫాను సృష్టించాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 165 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన అభిషేక్ శర్మ

రోహిత్ శర్మ నెలకొల్పిన ఈ మైలురాయిని అధిగమించేందుకు చాలామంది యంగ్ బ్యాటర్లు ప్రయత్నించినప్పటికీ, అభిషేక్ శర్మ మాత్రమే దానికి అత్యంత సమీపంలోకి రాగలిగాడు. 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అభిషేక్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగులు చేసి టీ20ల్లో భారత ప్లేయర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

40 కంటే తక్కువ బంతుల్లో విరుచుకుపడ్డ ఆటగాళ్లు

భారత టీ20 చరిత్రలో 40 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ మాత్రమే కావడం విశేషం. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్ సరిగ్గా 40 బంతుల్లో సెంచరీ సాధించి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ 41 బంతుల్లో, ఇషాన్ కిషన్ 42 బంతుల్లో శతకాలు బాది తర్వాతి స్థానాల్లో నిలిచారు.

టీ20ల్లో భారత ఫాస్టెస్ట్ సెంచరీల జాబితా

35 బంతులు – రోహిత్ శర్మ (శ్రీలంకపై, 2017)

37 బంతులు – అభిషేక్ శర్మ (ఇంగ్లాండ్‌పై, 2025)

40 బంతులు – సంజూ శామ్సన్

41 బంతులు – తిలక్ వర్మ

42 బంతులు – ఇషాన్ కిషన్

సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ లాంటి డాషింగ్ బ్యాటర్లు కూడా 50 బంతుల కంటే తక్కువ వ్యవధిలోనే సెంచరీలు బాదినప్పటికీ, రోహిత్ శర్మ నమోదు చేసిన 35 బంతుల రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *